Klin Kaara: మెగా ప్రిన్సెస్ పై స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్, ఉపాసన, క్లింకారా సాంగ్ విన్నారా ?..
క్లింకారా అంటే లలితా సహస్త్రనామాల్లో బీజాక్షరం. ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అని అర్థం. మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని ఈ పేరు సూచిస్తుంది. క్లింకారా రాకతో ఈసారి సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా బెంగుళూరులోని ఫాంహౌస్ లో పండగ సెలబ్రేషన్స్ చేస్తున్నారు మెగా, అల్లు ఫ్యామిలీ. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత వీరికి పాప జన్మించింది. గతేడాది జూన్ 20న జన్మించిన తమ పాపకు క్లింకారా అని నామకరణం చేశారు మెగా ఫ్యామిలీ. చిరు కుటుంబానికి ఇష్టమైన మంగళవారమే పాప పుట్టడంతో మెగా ఫ్యామిలీలో మరింత సంతోషం తోడైంది. క్లింకారా అంటే లలితా సహస్త్రనామాల్లో బీజాక్షరం. ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అని అర్థం. మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని ఈ పేరు సూచిస్తుంది. క్లింకారా రాకతో ఈసారి సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా బెంగుళూరులోని ఫాంహౌస్ లో పండగ సెలబ్రేషన్స్ చేస్తున్నారు మెగా, అల్లు ఫ్యామిలీ. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఇక ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ గారాలపట్టి క్లింకారా పై ఓ పాట రెడీ చేశారు మెగా ఫ్యాన్స్. సంక్రాంతి కానుకగా ఈ పాటను ఉపాసన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. మహవీర్ ఎల్లందర్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ కు తగ్గట్లుగా బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ అందించాడు. ఈ పాటను సింగర్ ధనుంజయ్ అద్భుతంగా ఆలపించాడు. ఆ పాటలో క్లింకారా జన్మించినప్పుడు హాస్పిటల్లోని క్షణాల నుంచి బారాసాల వరకు ప్రతి మూమెంట్ కవర్ చేసి చూపించారు.
గతంలో కీరవాణి తనయుడు కాలభైరవ కూడా క్లీంకారా కోసం ఓ ప్రత్యేకమైన ట్యూన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా అభిమానులు చరణ్ తనయ కోసం ఓ సాంగ్ చేశారు. ఇప్పటివరకు క్లింకారాకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కానీ చిన్నారి ముఖం చూపించకుండా జాగ్రత్తపడుతుంది మెగా ఫ్యామిలీ.నిన్న సంక్రాంతి సందర్భంగా దిగిన మెగా, అల్లు ఫ్యామిలీ ఫోటోలో సైతం క్లింకారా ముఖం కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.