Tollywood: 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. ఇప్పటికీ తరగని అందం..

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా మారింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Tollywood: 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. ఇప్పటికీ తరగని అందం..
Meena

Updated on: Feb 24, 2025 | 3:54 PM

సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో సినీప్రియుల ఆరాధ్య దేవత ఆమె. ప్రస్తుతం శ్రీలీల, రష్మిక మందన్నా, త్రిష వంటి స్టార్స్ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. కానీ 16 ఏళ్ల వయసులోనే దక్షిణాదిని శాసించింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మీనా. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తుంది. ముఖ్యంగా తెలుగులో బాలనటిగా అత్యధిక చిత్రాల్లో నటించింది. ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాతో కథానాయికగా మారింది. 1991లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో మీనా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అప్పుడు మీనా వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే.

ఆ తర్వాత 1992లో విడుదలైన మరో చిత్రంలో మీనా బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించింది. అదే విక్టరీ వెంకటేశ్ నటించిన చంటి మూవీ. ఈ సినిమా విడుదల సమయంలో మీనా వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. చంటి చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. రవిరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలుకొట్టింది. 16 ఏళ్ల వయసులో మొత్తం సినీ పరిశ్రమ తిరిగి చూసేలా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఏకైక నటి మీనా. ఈ సినిమా మొత్తం రూ. 16 కోట్లకు పైగా వసూలు చేసింది. అప్పట్లో 16 కోట్లు అంటే పెద్ద విషయంగా భావించేవారు. 16 ఏళ్ల వయసులో వెంకటేష్ తో నటించి హిట్ ఇచ్చిన వ్యక్తి, 44 ఏళ్ల వయసులో మళ్ళీ వెంకటేష్ తో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా దృశ్యం 2 కి తెలుగు రీమేక్.

ఇప్పటికీ సినిమాల్లో మీనా చురుగ్గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

Actress Meena

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..