- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh Goa Party, Post Wedding Celebrations with Husband Antony, See Photos
Keerthy Suresh: గోవాలో గ్రాండ్ పార్టీ.. భర్తతో కలిసి స్టెప్పులేసిన కీర్తి సురేష్.. ఫొటోస్ ఇదిగో
మహానటి కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీతో కలిసి గోవాలో గ్రాండ్ గా పార్టీ జరుపుకుంది. అనంతరం తమ పార్టీకి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో అవి కొద్ది క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి.
Updated on: Feb 24, 2025 | 4:20 PM

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గతేడాది పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త, చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కింది.

కాగా పెళ్లి తర్వాత తాను హీరోయిన్ గా నటించిన బేబీజాన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది కీర్తి సురేశ్. దీంతో భర్తతో కలిసి సమయం గడిపే అవకాశం రాలేదు.

తాజాగా కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీతో కలిసి గోవాలో పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ ఫోటోలకు ఇప్పటికే లక్షలాదికి పైగా లైకులు వచ్చాయి.

ఈ పార్టీ చాలా కలర్ ఫుల్ గా సాగింది. కీర్తి సురేష్ కూడా గ్లామరస్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఇక ఆంటోనీ కూడా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చాడు.

కీర్తి సురేష్ నటించిన 'బేబీ జాన్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కాగా కీర్తి సురేష్ చేతిలో ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

లేడీ ఓరియంటెడ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న రివాల్వర్ రీటాలో కీర్తి సురేశ్ మెయిన్ లీడ్ పోషిస్తోంది. అలాగే మరో సినిమాలోనూ కీర్తి యాక్ట్ చేస్తోంది.




