Ravi Teja: ‘క్రాక్’ ఇచ్చిన కిక్‌తో ట్రాక్‌లోకి మాస్ రాజా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాతో బిజీగా రవితేజ..
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. క్రాక్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫాంలోకి వచ్చారు. ప్రస్తుతం రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు.
Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. క్రాక్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫాంలోకి వచ్చారు. ప్రస్తుతం రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. రవితేజ కెరీర్‌లో 69వ సినిమా రాబోతోన్న ప్రాజెక్ట్‌కు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించనున్నారు. త్రినాథ రావు సినిమాల్లో ఎంతటి వినోదం ఉంటుందో అందరికీ తెలిసిందే. దసరా కానుకగా ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ మూవీకి ధమాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
ధమాకా అంటే అందరికీ తెలిసిందే. టైటిల్‌లోనే మంచి ఎనర్జీ కనిపిస్తోంది. నిజంగానే బ్లాస్ట్ అయ్యేలా ఉంది. రవితేజకు ఇది పర్ఫెక్ట్ టైటిల్. ఇక డబుల్ ఇంపాక్ట్ అనేది క్యాప్షన్. దసరా సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. అలాగే శరత్ మండవదర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా రామారావు ఆన్ డ్యూటీ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు రవి తేజ. ఈ సినిమాలో మాస్ రాజా సరసన దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు మాస్ రాజా.
మరిన్ని ఇక్కడ చదవండి :