‘Ramarao On Duty’: మాస్ జాతరకు ముహూర్తం ఫిక్స్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ వచ్చేది అప్పుడే
మాస్ మహారాజా రవితేజ గ్యాప్ లేకుండా వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు ఐదు సినిమాలు కమిట్ అయిన రవితేజ ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)గ్యాప్ లేకుండా వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు ఐదు సినిమాలు కమిట్ అయిన రవితేజ ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వాటిలో రామారావు ఆన్ డ్యూటీ(Ramarao On Duty) ఒకటి. రీసెంట్ గా ఖిలాడీ సినిమాతో వచ్చిన రవితేజ సాలిడ్ హిట్ ను అందుకోలేక పోయాడు. దాంతో ఇప్పుడు ఎలాగైనా భారీ హిట్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు. మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
‘రామారావు ఆన్ డ్యూటీ’ని రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలపడానికి చిత్ర యూనిట్ అన్ని విధాల భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చిత్ర నిర్మాతల నుండి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 16న.. అంటే మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ బ్లాక్ టీని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. టీజర్ సినిమాలోని యాక్షన్ సైడ్‌ని చూపించగా, ట్రైలర్ మిగతా ఎలిమెంట్స్ ప్రజంట్ చేయడానికి సిద్దమౌతుంది చిత్రయూనిట్. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.