Dhamaka Teaser: డబుల్ ఇంపాక్ట్ టీజర్.. మాస్ మహారాజా మరోసారి అదరగొట్టాడుగా
హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు మాస్ రాజా.. ఇక ఇప్పుడు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో..

మాస్ మహా రాజా రవితేజకు అర్జెంట్ గా ఓసాలిడ్ హిట్ కావాలి అదికూడా రీసౌండ్ వచ్చే రేంజ్ లో కావాలి.. అందుకోసమే ఇప్పుడు ధమాకా అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు మాస్ రాజా.. ఇక ఇప్పుడు త్రినాద్ రావు నక్కిన దర్శకత్వం లో ధమాకా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్లు.. సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే దీపావళి సందర్భంగా ధమాకా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు మేకర్స్. హాయ్ ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రవితేజ మరింత స్టైలిష్ గా ఎనర్జిటిక్ గా కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ఇప్పుడు సినిమా పై అంచనాలను పెంచేసింది.
ఇక ఈ టీజర్ ను యాక్షన్ సీన్స్ తో డిజన్ చేశారు. టీజర్ మొదటలోనే పవర్ ఫుల్ డైలాగ్ ను వినిపించారు. నేను మీలో విలన్ ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు.. కానీ నేను యాక్షన్ లో ఉన్నప్పుడు శాడిస్ట్ ని” అంటూ రవితేజ ఇంగ్లీష్ లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్ శ్రీలీల చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది.
ఇక టీజర్ చివరిలో “అట్నుంచీ ఒక బుల్లెట్ వస్తే… ఇట్నుంచి దీపావళి” అనే డైలాగ్ తో ఎండ్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు ధమాకాను తీసువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




