AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBK107: పవర్ ఫుల్ డైలాగ్ తో ఇరగదీసిన నటసింహం.. నెక్స్ట్ లెవల్‌లో ఎన్బీకే 107 గ్లిమ్ప్స్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన బాలయ్య ఆయా షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

NBK107: పవర్ ఫుల్ డైలాగ్ తో ఇరగదీసిన నటసింహం.. నెక్స్ట్ లెవల్‌లో ఎన్బీకే 107 గ్లిమ్ప్స్
Nbk 107
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2022 | 11:47 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక వైపు సినిమాలతో మరో వైపు టాక్ షోలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన బాలయ్య ఆయా షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టిల్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమాలో బాలయ్యకు జోడీగా అందాల భామ శ్రుతిహాసన్ నటిస్తోంది. అలాగే మరో పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా నుంచి టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు బాలయ్య.

ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ కావాలని ఎప్పటినుంచో నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. దీపావళి కానుకగా బాలయ్య సినిమా టైటిల్ ను ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఒక ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ ప్రోమోలు బాలయ్య అదిరిపోయే డైలాగ్ తో ఆకట్టుకున్నారు. ‘నరకడం మొదలుపెడితే.. ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా..’ అంటూ టీజర్ లో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో ఈ వీడియో ను కట్ చేశారు. ఇక ఈ మూవీ టైటిల్ లోగోను కర్నూలులోని ఐకానిక్ కొండారెడ్డి బురుజు దగ్గర లాంచ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఈరోజు శుక్రవారం (అక్టోబర్ 21) రాత్రి 8.15 నిమిషాలకు టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. ఏం చేసిందంటే..
మహిళల లోదుస్తులు దొంగిలించే భర్తకు భార్య షాక్.. ఏం చేసిందంటే..
విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
విజయ్ అభిమానిని చితక్కొట్టిన అజిత్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
బంగ్లా దెబ్బకు పాకిస్తాన్ యూటర్న్.. బలమైన టీంతో బరిలోకి..
బంగ్లా దెబ్బకు పాకిస్తాన్ యూటర్న్.. బలమైన టీంతో బరిలోకి..
బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండ
బ్రష్ చేసినా నోటి దుర్వాసన పోవడంలేదా.. అప్పుడేం చేయాలో తెలుసుకోండ
ఏపీలోని రైతులకు పండుగ చేసుకునే వార్త..
ఏపీలోని రైతులకు పండుగ చేసుకునే వార్త..
బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్.. చికెన్‌లో ఏది మంచిది..?
బ్రెస్ట్ పీస్ vs లెగ్ పీస్.. చికెన్‌లో ఏది మంచిది..?
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న రోబోట్ డాగ్స్..
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న రోబోట్ డాగ్స్..
తిన్న వెంటనే టీ తాగడం ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారు..?
తిన్న వెంటనే టీ తాగడం ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారు..?
మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
మాఫియా స్టైల్ దోపిడీ.. రూ.400 కోట్లతో వెళ్తున్న కంటైనర్లు హైజాక్
తెలంగాణలో వారందరికీ సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆర్ధిక సాయం
తెలంగాణలో వారందరికీ సూపర్ న్యూస్.. ప్రభుత్వ ఆర్ధిక సాయం