ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)ని నవంబర్ 11న ప్రారంభించారు. పార్టీలు పెట్టడం కష్టమని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, రాజకీయాలను శుభ్రం చేస్తానంటూ సాయిరెడ్డి కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది.