AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెల్మెట్ లేదన్న బీమా కంపెనీకి దిమ్మతిరిగే తీర్పు.. బాధితులకు రూ.3.20 కోట్ల పరిహారం!

రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబానికి భారీ ఊరట లభించింది. ఇండోర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శక్తి సింగ్ చౌహాన్ కుటుంబానికి రూ.3.20 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఈ మొత్తానికి ఏడాదికి 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. ప్రమాద సమయంలో మృతుడు హెల్మెట్ ధరించలేదని, బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారని బీమా సంస్థ వాదించినప్పటికీ కోర్టు వాటిని అంగీకరించలేదు.

హెల్మెట్ లేదన్న బీమా కంపెనీకి దిమ్మతిరిగే తీర్పు.. బాధితులకు రూ.3.20 కోట్ల పరిహారం!
Court Orders
Balaraju Goud
|

Updated on: Nov 12, 2026 | 11:53 AM

Share

రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన ఓ కుటుంబానికి భారీ ఊరట లభించింది. ఇండోర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శక్తి సింగ్ చౌహాన్ కుటుంబానికి రూ.3.20 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఈ మొత్తానికి ఏడాదికి 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. ప్రమాద సమయంలో మృతుడు హెల్మెట్ ధరించలేదని, బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారని బీమా సంస్థ వాదించినప్పటికీ కోర్టు వాటిని అంగీకరించలేదు.

వివరాల్లోకి వెళ్తే.. 2024 డిసెంబర్ 29న శక్తి సింగ్ చౌహాన్ తన మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తుండగా ఇండోర్‌లోని రౌ ప్రాంతంలో ఎస్‌రాక్ స్కూల్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శక్తి సింగ్ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో భార్య మితాలి, కుమార్తె హిమయశి, కుమారుడు అహైత్‌తో పాటు తల్లిదండ్రులు కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

శక్తి సింగ్ కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారంగా ఉన్నారు. ఆయన వార్షిక ఆదాయం సుమారు రూ.30 లక్షలుగా నమోదైంది. దీంతో కుటుంబ సభ్యులు తగిన పరిహారం కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే పరిహారం చెల్లించకుండా ఉండేందుకు బీమా కంపెనీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రమాద సమయంలో మృతుడు హెల్మెట్ ధరించలేదని, బైక్‌పై ముగ్గురు ఉన్నారని, ప్రమాదాన్ని నివేదించడంలో ఏడు రోజుల ఆలస్యం జరిగిందని వాదించింది. బస్సు డ్రైవర్‌కు అవసరమైన పత్రాలు, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా అనే అంశాలను కూడా ప్రస్తావించింది.

అయితే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, పోలీసుల దర్యాప్తులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వెల్లడైంది. వెనుక నుంచి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టినట్లు ఆధారాలు లభించాయి. దీంతో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అవాన్ మహమ్మద్ బీమా సంస్థ వాదనలను తోసిపుచ్చారు. మృతుడి నిర్లక్ష్యాన్ని నిరూపించడంలో బీమా కంపెనీ విఫలమైందని స్పష్టం చేశారు. మొత్తం రూ.3,20,60,582 పరిహారాన్ని 6 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని ఆదేశించారు. పరిహారంలో 40 శాతం భార్యకు, 20 శాతం చొప్పున ఇద్దరు పిల్లలకు, 10 శాతం చొప్పున తల్లిదండ్రులకు కేటాయించారు. ఈ తీర్పుతో కుటుంబ పోషకుడిని కోల్పోయిన బాధిత కుటుంబానికి ఆర్థికంగా కొంత భరోసా లభించనుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us