Unni Mukundan: ‘సిగరెట్లు కాల్చకండ్రా.. హెల్త్‌లు పాడైపోతాయ్.. దాని బదులు ఇది ట్రై చేయండి’: మార్కో హీరో

సినిమాల్లో కథ డిమాండ్ ను బట్టి ఇంకా ఎలివేషన్స్ కోసం రకరకాల స్టైల్ లో సిగరెట్స్ తాగుతుంటారు హీరోలు. అయితే హీరోలను చూసి కొందరు అభిమానులు కూడా అలాగే చేస్తుంటారు. అలవాటు లేకున్నా తమ హీరో చేశాడని గుప్పు గుప్పమంటూ సిగరెట్లు లాగుతుంటారు. అయితే దయచేసి అలా చేయద్దంటున్నాడు మార్కో హీరో ఉన్ని ముకుందన్.

Unni Mukundan: సిగరెట్లు కాల్చకండ్రా.. హెల్త్‌లు పాడైపోతాయ్.. దాని బదులు ఇది ట్రై చేయండి: మార్కో హీరో
Unni Mukundan

Updated on: May 01, 2025 | 2:19 PM

సినిమాలో తమ అభిమాన హీరో సిగరెట్ కాల్చడం చూసి నిజ జీవితంలో సిగరెట్లకు బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. చివరికీ అలవాటు లేకున్నా తమ హీరో చేశాడని స్టైల్ కోసం సిగరెట్లు తాగుతుంటారు కొందరు. అలాంటి వారికి మలయాళ ప్రముఖ నటుడు, మార్కో మూవీ ఫేమ్ ఉన్ని ముకుందన్ కొన్ని కీలక సలహలు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘రెట్రో’ సినిమాలో సూర్య ఓ గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమా గురువారం ( మే 1)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌లో సూర్య పలు సీన్స్ లో సిగరెట్ తాగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే దానిని ఎవరూ అనుకరించకూడదని సూర్య కోరారు. ఇప్పుడు ఉన్ని ముకుందన్ కూడా ఇదే విషయం గురించి తన అభిమానులకు ఒక సూచన ఇచ్చాడు. సినిమాల్లో లాగా సిగరెట్లు కాల్చడానికి బదులుగా తన లాగే సిక్స్ ప్యాక్ ను సాధించేందుకు ప్రయత్నించాలని తన అభిమానులకు సూచించాడీ మాలీవుడ్ హీరో.

సూపర్ హిట్ సినిమా ‘మార్కో’లో పలు సీన్స్ లో ఉన్ని ముకుందన్ సిగరెట్ తాగుతూ కనిపించాడు. అదే సమయంలో తన సిక్స్ ప్యాక్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ కొంతమంది అభిమానులు సిక్స్ ప్యాక్ వదిలేసి సిగరెట్ ప్యాకెట్ పట్టుకుంటున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి ఉన్ని ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

‘ఒక సిగరెట్ బరువు సాధారణంగా బ్రాండ్, రకాన్ని బట్టి 0.7 నుండి 1.0 గ్రాముల మధ్య ఉంటుంది. ఫిల్టర్ అండ్ పేపర్ తో కలిసి అటూ ఇటూ సగటున 1 గ్రాము ఉంటుంది. ఇలాంటి వాటి బదులు 50 కిలోల బరువును ఎత్తుకోండి. ఛాయిస్ మీదే. చేతిలో సిగరెట్స్ తో మార్కోను అనుకరించడం చాలా సులభం. కానీ రెండోది అంటే సిక్స్ ప్యాక్ తో నన్ను అనుకరించాలంటే మీకు సంకల్ప బలం అవసరం’ అని రాసుకొచ్చాడు ఉన్ని ముకుందన్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఉన్ని ముకుందన్ మాటలను నెటిజన్లు ప్రశంసించారు. తన అభిమానుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపినందుకు హీరోను కొనియాడుతున్నారు. దీనిపై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఉన్నిముకుందన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.