AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Anshu: నాగార్జున ‘మన్మథుడు’ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ‘దేవుడి ముందు అలా చేస్తారా’ అంటూ..

నాగార్జున నటించిన 'మన్మథుడు' సినిమా ఇప్పటికీ చాలామంది ఫేవరెట్‌. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, నాగార్జున నటన, హీరోయిన్ల అందం, అభినయం, త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌.. ఈ సినిమాలో అన్నీ హైలెట్‌గా నిలిచాయి. ఇప్పటికీ మన్మథుడు టీవీల్లో వస్తే ఛానెల్‌ మార్చకుండా చూసేవారు చాలామంది ఉన్నారు

Actress Anshu: నాగార్జున 'మన్మథుడు' హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. 'దేవుడి ముందు అలా చేస్తారా' అంటూ..
Actress Anshu Ambani
Basha Shek
|

Updated on: May 23, 2023 | 4:02 PM

Share

నాగార్జున నటించిన ‘మన్మథుడు’ సినిమా ఇప్పటికీ చాలామంది ఫేవరెట్‌. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, నాగార్జున నటన, హీరోయిన్ల అందం, అభినయం, త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌.. ఈ సినిమాలో అన్నీ హైలెట్‌గా నిలిచాయి. ఇప్పటికీ మన్మథుడు టీవీల్లో వస్తే ఛానెల్‌ మార్చకుండా చూసేవారు చాలామంది ఉన్నారు. ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు అన్షు అంబానీ. సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఉన్నది కాసేపే అయినా క్యూట్‌ లుక్స్‌, చక్కని అభినయంతో ఆకట్టుకుంది అన్షు. మన్మథుడు సినిమా క్రేజ్‌తో ప్రభాస్‌ రాఘవేంద్రలోనూ హీరోయిన్‌గా నటించింది. అయితే సినిమాల్లో బిజీగా ఉండగానే సచిన్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. అక్కడే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ బిజినెస్‌ చేస్తుందని తెలుస్తుంది. కాగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది అన్షు. తన ఫ్యామిలీ ఫొటోస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటుంది. అలా తాజాగా అన్షు షేర్‌ చేసిన ఒక ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అదే సమయంలో నెటిజన్లు ఈ ఫొటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు ఏమైందంటే.. అన్షు తాజాగా షేర్‌ చేసిన ఫొటోలో వినాయక విగ్రహం వద్ద చెప్పులు వేసుకుని కనిపించిందామె. ఇప్పుడిదే నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దేవుడి దగ్గర చెప్పులు వేసుకోవడమేంటి? అంటూ నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొందరైతే ఏకంగా బూతులతో విరుచుకుపడుతున్నారు. అయితే ఇది అనుకోకుండానే జరిగింది. కొందరు నెటిజన్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!