Sai Pallavi: నేనే మీకు పెద్ద అభిమానిని.. మణిరత్నం మాటలకు ఎమోషనల్ అయిన సాయి పల్లవి
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. నటనలోఈ ముద్దుగుమ్మను మించిన వారు లేరనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.
తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సాయి పల్లవి. మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి మెప్పించింది ఈ భామ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. నటనలోఈ ముద్దుగుమ్మను మించిన వారు లేరనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎలాంటి గ్లామర్ పాత్రలు చేయకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అమ్మడు. సాయి పల్లవి నటించిన ‘అమరన్’ ఈరోజు (అక్టోబర్ 31) విడుదల కానుంది. ఈ చిత్రంలో శివకార్తికేయకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి మణిరత్నం అతిథిగా హాజరయ్యారు. ఆయన సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు.
సాయి పల్లవి పాత్రలు వాస్తవికంగా ఉంటాయి అని అన్నారు మణిరత్నం. ఈ సినిమాలో సాయి పల్లవి బాగా చేసారని నా ఫీలింగ్. నేనే ఆమెకు పెద్ద అభిమానిని’ అని మణిరత్నం చెప్పడంతో సాయి పల్లవి కన్నీళ్లు పెట్టుకుంది. చాలా మంది యువ దర్శకులు సాయి పల్లవితో పని చేయాలని భావించడం సహజం. పల్లవి యువ దర్శకులకే కాదు సీనియర్ దర్శకులకు కూడా ఇష్టమని నిరూపించుకుంది. “నేను మీతో ఒకరోజు పని చేయాలి” సాయి పల్లవితో మణిరత్నం అన్నారు.
మణిరత్నం నుంచి సాయి పల్లవి ఇలాంటి మాటలు ఊహించలేదు. దాంతో ఆమె ఎమోషనల్ అయ్యింది. మణిరత్నం మాటలకు ధన్యవాదాలు తెలిపింది సాయి పల్లవి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. ముకుంద్ పాత్రలో శివకార్తికేయ నటించారు. ముకుంద్ భార్య ఇందు రెబెక్కాగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం శివ అరూర్, రాహుల్ సింగ్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. కాగా మణిరత్నం ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా చేస్తున్నారు. మణిరత్నం సినిమాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.