SSMB9: మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఈ హీరోయిన్ కూడా..

మునుపెన్నడూ లేని విధంగా గడ్డం, జుట్టు పెంచాడు. అంతే కాదు రాజమౌళి కూడా ఏఐలో శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం కెన్యాలో పర్యటిస్తున్నారు రాజమౌళి.

SSMB9: మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఈ హీరోయిన్ కూడా..
Ssmb 29
Follow us

|

Updated on: Oct 31, 2024 | 8:28 AM

రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ తన లుక్ మొత్తం మార్చేశాడు. మునుపెన్నడూ లేని విధంగా గడ్డం, జుట్టు పెంచాడు. అంతే కాదు రాజమౌళి కూడా ఏఐలో శిక్షణ తీసుకుంటున్నాడు. అలాగే ప్రస్తుతం కెన్యాలో పర్యటిస్తున్నారు రాజమౌళి. అక్కడ తన సినిమా కోసం లొకేషన్ కోసం వెతుకుతున్నారు జక్కన్న. ఈ సినిమాను జంగిల్ అడ్వెంచర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రాజమౌళి. ఇదిలా ఉంటే రీసెంట్ గా రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఓ సింహం ఫోటోను రాజమోళి షేర్ చేశారు. ఆ సింహం ఫొటోకు మహేష్ బాబును ట్యాగ్ చేశారు రాజమౌళి. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ను రాజమౌళి ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ఇప్పటికే ఓ ఇండోనేషియా నటిని సంతకం చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆమె దీపికా పదుకొణె. గతంలోనూ ఈ అమ్మడి పేరు వినిపించింది.. ఇప్పుడు మరోసారి ఆమె గురించి వార్త వైరల్ అవుతుంది.

దీపికా ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే పదుకొణె ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లను పరిశీలిస్తోంది. వీటిలో ఒకటి SSMB29 అని అంటున్నారు. వాస్తవానికి, రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ఇప్పుడు SSMB29లో కూడా అలాంటి పాత్రలే సృష్టిస్తున్నాడు. దీనికి రాజమౌళి టాప్ ఛాయిస్ దీపికా పదుకొణే. ఇప్పటికే ఆమెను సంప్రదించగా.. దీపికా పదుకొణె కొంత సమయం అడిగినట్లు సమాచారం. ఇప్పుడే తల్లి అయింది కాబట్టి వెంటనే షూటింగ్ ప్రారంభించాలనుకోలేదని తెలుస్తోంది..కానీ ఆమెను తన సినిమాలో నటింపజేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు టాక్. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవలే కల్కి సినిమాతో దీపికా పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..