సుదీర్ బాబు సినిమానుంచి మాస్ మసాలా సాంగ్ .. మరోసారి ఆడియన్స్ ను ఉర్రుతలూగించిన మణిశర్మ

| Edited By: Rajeev Rayala

Jul 09, 2021 | 9:15 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సుదీర్ బాబు ఒకరు. విబిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ కుర్ర హీరో. శివ మనసులో శృతి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు.

సుదీర్ బాబు సినిమానుంచి మాస్ మసాలా సాంగ్ .. మరోసారి ఆడియన్స్ ను ఉర్రుతలూగించిన మణిశర్మ
Sridevi Soda Center
Follow us on

sridevi soda center : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సుదీర్ బాబు ఒకరు. విబిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ కుర్ర హీరో. శివ మనసులో శృతి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ బాబు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. తాజాగా శ్రీదేవీ సోడా సెంటర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు సుదీర్ బాబు. ఆనంది హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని  70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మెలోడీ బ్రహ్మం మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. ఆ తరువాత విడుదలైన గ్లిమ్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ మధ్యనే డబ్బింగ్ పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన సుధీర్ బాబు వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ సినిమానుంచి మాస్ మసాలా సాంగ్ ను రిలీజ్ చేశారు.

‘మందులోడా’ అంటూ సాగే ఓ పాటను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు మణిశర్మ అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సాంగ్ కు యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసాడు. మాస్ ట్యూన్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అయిన మణిశర్మ.. ‘మాస్ కా బాస్ సాంగ్ మందులోడా’ సాంగ్ తో మాస్ ఆడియన్స్ ను ఉర్రుతలూగించేలా చేశాడనే చెప్పాలి. ఈ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

‘ఉప్పెన’ సినిమాలో మొదట కృతిని హీరోయిన్‌గా అనుకోలేదట.. షాకింగ్ విషయం చెప్పిన దర్శకుడు..

Tamannaah: మిల్కీ బ్యూటీ డాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న తమన్నా..

డాన్సింగ్ దాది.. దీపిక పదుకునేను డామినేట్ చేసిన బామ్మా.. డాన్స్ చూస్తే మతిపోవాల్సిందే