Kannappa Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా గురించి సెలబ్రెటీస్ సైతం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. దీంతో రోజు రోజుకీ కన్నప్ప సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ డ్రామాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సైతం కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల ముఖ్యమైన పాత్రలలో నటించారు. దీంతో మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలుఏర్పడ్డాయి. ఇక మంచు విష్ణు మాత్రం ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. కొన్నేళ్లుగా ఈ కన్నప్ప చిత్రం కోసం కష్టపడుతున్నారు. న్యూజిలాండ్ లో కొన్ని నెలల పాటు షూటింగ్ చేశారు. అళాగే వీఎఫ్ఎక్స్ విషయంలోనూ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఎట్టకేలకు ఈరోజు (జూన్ 27న) కన్నప్ప సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది.
ఇప్పటికే కన్నప్ప సినిమా గురించి చాలా మంది సినీ ప్రముఖులు గొప్పగా చెప్పారు. అలాగే ఇదివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ సైతం సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసారు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి అడియన్స్ సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని.. ప్రభాస్ ఎంట్రీ.. చివర్లో మంచు విష్ణు పర్ఫార్మెన్స్, బీజీఎమ్ బాగుందని అంటున్నారు.
సినిమా మొత్తం భక్తితో నిండి ఉంటుందని.. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం హైలెట్ అంటున్నారు. ప్రభాస్ రోల్.. ఇతర స్టార్స్ పాత్రలు గూస్ బంప్స్ తెప్పిస్తాయని.. అలాగే న్యూజిలాండ్ అందాలను మరింత అద్భుతంగా చూపించారట. ఈ సినిమాకు మ్యూజిక్, విజువల్స్, బీజీఎమ్ హైలెట్ అవుతాయని..ముఖ్యంగా చివర్లో 20 నిమిషాలు మంచు విష్ణు యాక్టింగ్ అద్భుతమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#Kannappa reviews are pouring everywhere:
1st half average2nd half blockbuster
Positives:Prabhas cameoLast 20 mins perfomance by vishnu annaBGM#BlockbusterKannappa pic.twitter.com/sD8CVAkR3E
— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 26, 2025
#Kannappa picks up from pre-interval & becomes an excellent watch for 2nd half. Excellent & riveting cameo by Prabhas. Film is filled with innocent Bhakti & eternal Sanatana Dharma values. Very well done . Om Namaha Shivaya 🔱🕉️❤️🚩
Kudos to @iVishnuManchu massive respect! 🧡🙏 pic.twitter.com/YZrJDVUPL1
— Charlie Harper 🇮🇳 (@suryatej_borra) June 26, 2025
Flat 1st half,average 2bd half with decent climax edhe na talk #Kannappa
— Dragon 🐉 (@Koratalabanisa) June 27, 2025
Vishnu delivers a surprisingly impressive performance in climax#Prabhas Cameo🔥🫡😲Devotional songs❤️production quality👍🏻#MohanBabu👏Essence of Sri Kalahasti and Kannappa is beautifully captured in 2nd half
Rating: 3.5/5#KannappaMovie #KannappaReview #Kannappa #AkshayKumar https://t.co/aGAOUJtvZw
— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025
My show was done decent Hit to super Hit #Kannappa
— MB Cult (@GHariteja2) June 26, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..








