AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకంపనలు సృష్టించిన కేరళ క్యాస్టింగ్ కౌచ్‌ కేసులు.. విచారణ సమయంలో సిట్ సంచలన నిర్ణయం..!

క్యాస్టింగ్ కౌచ్‌.. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఈ పదం తీవ్ర ప్రకంపనలు రేపింది. కేరళ సినీ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ సంచలనం సృష్టించింది. అయితే.. ఈ కేసుల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై అధ్యయనం చేసేందుకు జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేయగా.. దాదాపు రెండేళ్లు శ్రమించి.. 295 పేజీలతో కీలక రిపోర్ట్‌ రూపొందించింది.

ప్రకంపనలు సృష్టించిన కేరళ క్యాస్టింగ్ కౌచ్‌ కేసులు.. విచారణ సమయంలో సిట్ సంచలన నిర్ణయం..!
Kerala High Court
Balaraju Goud
|

Updated on: Jun 27, 2025 | 6:16 AM

Share

క్యాస్టింగ్ కౌచ్‌.. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఈ పదం తీవ్ర ప్రకంపనలు రేపింది. కేరళ సినీ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ సంచలనం సృష్టించింది. అయితే.. ఈ కేసుల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌పై అధ్యయనం చేసేందుకు జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేయగా.. దాదాపు రెండేళ్లు శ్రమించి.. 295 పేజీలతో కీలక రిపోర్ట్‌ రూపొందించింది. వీటిలో అత్యంత సున్నితమైన అంశాలతో ఉన్న 63 పేజీలను మినహాయించి మిగిలిన నివేదికను బహిర్గతం చేసింది.

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 15మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీని శాసిస్తున్నారని హేమా కమిటీ పేర్కొంది. వీళ్లు చెప్పినట్లే కేరళ సినీ ఇండస్ట్రీ నడుస్తోందని.. వాళ్లకు ఎదురు తిరిగిన వారి జీవితాలు నాశనమైపోయాయని వెల్లడించడం కాక రేపింది. అమ్మాయిలు కమిట్‌మెంట్‌కు సిద్ధం కావాల్సిందేనని, లొంగకపోతే సెట్‌లో రీషూట్‌ల పేరుతో హింసించేవారని కొందరు నటీమణులు చెప్పినట్లు ప్రకటించింది. హేమ కమిటీ రిపోర్ట్‌తో పెద్దయెత్తన విమర్శలు రావడంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌కు సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో పాటు పలువురు ప్రముఖులు రాజీనామాలు కూడా చేశారు.

హేమ కమిటీ రిపోర్ట్‌తో కేరళ ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పటికీ.. దాదాపు 35 కేసులు నమోదవ్వగా వీటిని దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ప్రస్తుతం ఈ కేసులన్నింటినీ మూసివేస్తున్నట్లు కేరళ హైకోర్టుకు సిట్ తెలియజేయడం సంచలనంగా మారింది. ఈ కేసుల విచారణలో సాక్ష్యం చెప్పేందుకు బాధితులు, సాక్షులు ముందుకు రావడం లేదని.. అందుకే వాటిని మూసివేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కేరళ కోర్ట్.. ప్రస్తుతానికి ఈ కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, వాటిని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. మొత్తంగా.. క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించిన 35 కేసుల్లో సిట్‌ ఎంక్వైరీని క్లోజ్‌ చేయడం కేరళ చిత్రసీమలో చర్చనీయాంశం అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!