Mohan Babu: అన్నదమ్ముల గొడవపై మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం.. వీడియో డిలీట్ చేసిన మనోజ్

మనోజ్‌ పెళ్లికి కేవలం చుట్టంచూపుగా వచ్చి వెళ్లాడు విష్ణు. అప్పుడే ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇంత త్వరగా అవి బయటపడతాయని ఎవరూ ఊహించలేదు.

Mohan Babu: అన్నదమ్ముల గొడవపై మోహన్ బాబు తీవ్ర ఆగ్రహం.. వీడియో డిలీట్ చేసిన మనోజ్
Manchu Mohan Babu
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2023 | 12:18 PM

చిన్న విషయంగా చెబుతున్న మనోజ్, విష్ణుల మధ్య వివాదం గాలివానగా మారింది. త‌న‌ మ‌నిషి అయిన సార‌థి అనే వ్య‌క్తిపై విష్ణు దాడి చేయ‌టానికి వ‌చ్చాడంటూ మ‌నోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’ అంటూ మనోజ్ వాయిస్‌ ఆ వీడియోలో వినిపిస్తుంది. .‘వాడేదో అంటున్నాడు కదా’ అని విష్ణు ముందుకు దూసుకురావడం.. అతడిని ఓ ఇద్దరు ఆపే ప్రయత్నం కూడా చూడవచ్చు. కాగా ఈ గొడవపై నటుడు మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు.

సోషల్‌మీడియాకు ఎందుకు ఎక్కారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గురువారం రాత్రి సారథి ఇంట్లో ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు మోహన్‌బాబు. వీడియో డిలీట్ చెయ్యమని మనోజ్‌కు మోహన్‌బాబు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఫేస్‌బుక్ స్టేటస్‌ డిలీట్ చేశాడు మనోజ్‌. ఈ గొడవపై టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు మోహన్ బాబు. అవేశం అన్నిటికీ అనర్థం అని.. వాళ్లింకా అది తెలుసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

అన్నదమ్ముల మధ్య గొడవ ఇప్పటిది కాదా?..  కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య ఉన్న గొడవేంటి?.. మోహన్ బాబు ఎవరికి మద్దతుగా ఉన్నారు. రెండుమూడేళ్లుగా విష్ణుకి బర్త్‌డే విషెస్ కూడా చెప్పలేదు మనోజ్‌. మనోజ్‌ పెళ్లికి కేవలం చుట్టపుచూపుగా వచ్చి వెళ్లాడు విష్ణు. అంతలా విబేధాలు రావడానికి కారణాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శీతాకాలంలో.. గోంగూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
శీతాకాలంలో.. గోంగూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హీరో నిఖిల్.. కారణమేంటంటే?
తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హీరో నిఖిల్.. కారణమేంటంటే?
కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టేయండి.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ
కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టేయండి.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ
సోయాబీన్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
సోయాబీన్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
విమర్శలు ఎదుర్కొని వయ్యారాలతో మతిపోగొట్టేస్తోన్న వయ్యారి..
విమర్శలు ఎదుర్కొని వయ్యారాలతో మతిపోగొట్టేస్తోన్న వయ్యారి..
'రామ్ చరణ్ అద్భుతం.. అప్పన్న పాత్ర లైఫ్ టైం గుర్తుండిపోతుంది'
'రామ్ చరణ్ అద్భుతం.. అప్పన్న పాత్ర లైఫ్ టైం గుర్తుండిపోతుంది'
కంటి చూపు షార్ప్ అవ్వాలంటే.. ఈ ఫుడ్స్ తప్పనిసరి..
కంటి చూపు షార్ప్ అవ్వాలంటే.. ఈ ఫుడ్స్ తప్పనిసరి..
చలికాలంలో తడి బట్టలు ఆరడం లేదా? ఇలా చేయండి.. త్వరగా అరిపోతాయి!
చలికాలంలో తడి బట్టలు ఆరడం లేదా? ఇలా చేయండి.. త్వరగా అరిపోతాయి!
చివరకు నా చేతిలోనే రక్తం కక్కుకుని.. ఏవీఎస్ కూతురు..
చివరకు నా చేతిలోనే రక్తం కక్కుకుని.. ఏవీఎస్ కూతురు..
ఈ ఎలుకకు ఎంత పరిశుభ్రత..! ఒళ్లంతా సబ్బు రాసుకుని స్నానం చేస్తోంది
ఈ ఎలుకకు ఎంత పరిశుభ్రత..! ఒళ్లంతా సబ్బు రాసుకుని స్నానం చేస్తోంది