AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ఐసీయూలో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. సాయం చేయాలని మంచు మనోజ్ రిక్వెస్ట్

టాలీవుడ్ రాక్ స్టార్, హీరో మంచు మనోజ్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. భైరవం సినిమా తో రీఎంట్రీ ఇచ్చిన అతను ఇప్పుడు మిరాయ్ లో విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 12)న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Manchu Manoj: ఐసీయూలో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. సాయం చేయాలని మంచు మనోజ్ రిక్వెస్ట్
Manchu Manoj
Basha Shek
|

Updated on: Sep 11, 2025 | 6:41 PM

Share

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు సామాజిక స్పృహ ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఠక్కున స్పందిస్తాడు. నేనున్నానంటూ అండగా నిలబడతాడు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ఉంటే వెంటనే రియాక్ట్ అయ్యాడు. ‘ధైర్యంగా ఉండు తమ్ముడు. మేమంతా నీతోనే ఉన్నాం. లవ్‌యూ. నీ నంబర్ పంపించు’ అని మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. తాజాగా మంచు వారబ్బాయి సోషల్ మీడియా వేదికగా మరో విజ్ఞప్తి చేశాడు. 100కు పైగా సినిమాల్లో నటించి నవ్వించిన ఒక టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడని, ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి అండగా నిలిచి మన ప్రేమ, మద్దతు తెలపాలని రిక్వెస్ట్ చేశాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడికి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలను కూడా షేర్ చేశాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది సినీ అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన సాయం చేస్తున్నారు.

వెంకీ’ సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్‌గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర ఇప్పుడు పూర్తిగా దీన స్థితిలో ఉన్నాడు. పక్షవాతం కారణంగా ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తమ్ముడే తన బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర ఇటీవలే వెల్లడించాడు. రామ చంద్ర గురించి తెలుసుకున్న మంచు మనోజ్ ఇటీవలే అతని ఇంటికెళ్లాడు. నటుడిని పరామర్శించాడు. అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి రామ చంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ అతనిని ఆదుకోవాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలే ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ కూడా రామ చంద్ర వైద్య చికిత్సల కోసం రూ.25,000 ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ పోస్ట్..

రామచంద్ర ఇంట్లో మంచు మనోజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..