Manchu Manoj : మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నాడంటూ వార్తలు.. తనదైన స్టైల్‌లో స్పందించిన మంచువారబ్బాయి..
సోషల్ మీడియాలో ఏదైనా తొందరగా ప్రజలకు చేరిపోతుంది. అది పాజిటివ్ విషయమైనా.. నెగిటివ్ విషయమైనా. ఇక సెలబ్రెటీల గురించయితే చిన్న..
Manchu Manoj : సోషల్ మీడియాలో ఏదైనా తొందరగా ప్రజలకు చేరిపోతుంది. అది పాజిటివ్ విషయమైనా.. నెగిటివ్ విషయమైనా. ఇక సెలబ్రెటీల గురించయితే చిన్న విషయం తెలిసిన అది క్షణాల్లో సంచలనంగా మారిపోతుంటుంది. కొన్ని సార్లు సినిమాలకు, సినిమాతారలకు సంబంధించిన విషయాల్లో పుకార్లు గట్టిగానే షికారు చేస్తుంటాయి. అయితే ఈ సారి మంచి మనోజ్ గురించి అలాంటి వార్తే నెట్టింట వైరల్ అయ్యింది. ఇక పై మంచు మనోజ్ సినిమాలు చేయడం లేదని, ఆయన మూవీస్‌కు గుడ్ బై చెప్పేశారని, ప్రస్తుతం ఆయన నటిస్తున్న అహం బ్రహ్మాస్మి సినిమానే లాస్ట్‌ది అని వార్తలు వినిపించాయి. దాంతో ఒక ప్రముఖ వెబ్ సైట్‌లో ఆయన పై ఓ ఆర్టికల్ రచించారు. మనోజ్ ఇక వెండి తెరపై కనిపించారని, సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్ పెట్టబోతున్నాడని రాసుకొచ్చారు. దాంతో మనోజ్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఈ వార్త అటు తిరిగి ఇటు తిరిగి చివరకు హీరో కంట పడింది. దాంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
తాను సినిమాలు మానేయడం లేదు అని క్లారిటీ ఇచ్చాడు మనోజ్. ట్విట్టర్‌లో మంచు మనోజ్ స్పందిస్తూ.. తప్పుడు న్యూస్‌ను ప్రచారం చేయవద్దన్నా.. సమ్మర్ నుండి మన సినిమాలు మొదలు అవ్వబోతున్నాయి. యాక్షన్ అని చెప్పక ముందే కట్ చెప్పొద్దు అన్న. తర్వాత ఆర్టికల్ అయినా మీ నుండి నాకు సపోర్ట్‌గా వస్తుందని ఆశిస్తున్నాను అంటూ సున్నితంగా స్పందించాడు. అలాగే ఈ పోస్ట్‌కు బ్రహ్మానందం ఫోటోలను జత చేశాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత మంచు మనోజ్ నుంచి సినిమా రాబోతుంది. అహం బ్రహ్మాస్మి అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని అంటున్నారు. అలాగే సమ్మర్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను మంచు మనోజ్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. దాంతో మనోజ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.