AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు.. ఇప్పుడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా.. మంచు మనోజ్ ఎమోషనల్

మంచు మనోజ్ మళ్లీ బిజీగా మారిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ ఆకట్టుకుంటున్నాడీ టాలీవుడ్ రాక్ స్టార్. ఇదిలా ఉంటే ఓ దివంగత హీరో గురించి మంచు మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Manchu Manoj: ఆ హీరో మమ్మల్ని ఎత్తుకొని పెంచాడు.. ఇప్పుడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా.. మంచు మనోజ్ ఎమోషనల్
Manchu Manoj
Basha Shek
|

Updated on: Sep 17, 2026 | 10:45 AM

Share

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. భైరవం సినిమాతో హీరోగా ఆకట్టుకున్న మనోజ్ మిరాయ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా మెప్పించాడు. ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ విలన్ గా సైమా అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుత ఈ హీరో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తోన్న ఆస్మాన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు మనోజ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఈ మంచు వారబ్బాయి దివంగత నటుడు శ్రీహరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ‘మేఘాంశ్ నా తమ్ముడు. ఆస్మాన్ మూవీ టీజర్ లాంచ్ కి రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను టీజర్ చూశాను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మనం బాగా ప్రేమించే వాళ్లకు ఎప్పుడు సక్సెస్ రావాలని, లైఫ్ లో వాళ్లు నిలబడాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. అలా నేను బలంగా కోరుకునే వాళ్లలో నా తమ్ముడు మేఘాంశ్ ఒకరు. ఎందుకంటే శ్రీహరి అంకుల్ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచారు. ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. తమ్ముడు మేఘాంశ్ ని నేను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను. మా నాన్నగారు, మేఘాంశ్ వాళ్ల నాన్నగారు.. ఇద్దరూ సొంత అన్నదమ్ముళ్లులాగా ఉండేవారు. ఎప్పుడు ఆయన గురించి చెప్తున్నా నా మనసు కదులుతుంది. కానీ ఇప్పుడు మన మధ్య ఆయన లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ‘సినిమా’ ఉన్నంత కాలం రియల్ స్టార్ శ్రీహరి గారి పేరు ఎప్పటికీ ఉండిపోతుంది. అది మాత్రం నిజం. ఆయన ప్రతిరూపమైన మేఘాంశ్ శ్రీహరి ఈరోజు ఒక సక్సెస్ ఫుల్ టీజర్ తో ఇలా మన ముందుకి వచ్చి, ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వబోతున్నాడని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

ఇక ఆస్మాన్ టీజర్ గురించి మాట్లాడిన మనోజ్.. ‘ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు మనం కరెక్ట్ సలహా ఇవ్వలేం. బయట వాళ్లకి ఇవ్వగలుగుతాం కానీ.. సొంత వాళ్లకి ఇవ్వలేం. ఈ టీజర్ ఎలా ఉంటుందో అనుకుంటూ వచ్చాను. కానీ అద్బుతంగా ఉంది’ అని అన్నారు. కాగా మనోజ్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న దాదాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడీ రాక్ స్టార్. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది .ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా దాదా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మేఘాంశ్ శ్రీహరి ఇంటర్వ్యూ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us