AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS RRBలో 13,706 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెప్టెంబర్‌ 21తో ముగుస్తున్న దరఖాస్తుల గడువు

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు IBPS శుభవార్త అందించింది. రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో వివిధ పోస్టుల భర్తీకి CRP RRBs XV నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 13,706 పోస్టుల్లో ఆఫీస్‌ అసిస్టెంట్‌, ఆఫీసర్‌ స్కేల్‌-I, II, III ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, CA, MBA వంటి అర్హతలు అవసరం. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. సెప్టెంబర్‌ 1 నుంచి 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

IBPS RRBలో 13,706 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. సెప్టెంబర్‌ 21తో ముగుస్తున్న దరఖాస్తుల గడువు
IBPS RRB Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 17, 2026 | 10:33 AM

Share

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (RRBs) కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-RRBs XV ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 13,706 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ నియామకాల్లో గ్రూప్‌-ఏ ఆఫీసర్లు (స్కేల్‌-I, II, III), గ్రూప్‌-బి ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..

  • ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టుల సంఖ్య: 8,183
  • ఆఫీసర్‌ స్కేల్‌-I (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల సంఖ్య: 4,256
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) పోస్టుల సంఖ్య: 666
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (ఐటీ) పోస్టుల సంఖ్య: 182
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (చార్టర్డ్‌ అకౌంటెంట్‌) పోస్టుల సంఖ్య: 81
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (లా) పోస్టుల సంఖ్య: 46
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (అగ్రికల్చర్‌ ఆఫీసర్‌) పోస్టుల సంఖ్య: 38
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (ట్రెజరీ మేనేజర్‌) పోస్టుల సంఖ్య: 18
  • ఆఫీసర్‌ స్కేల్‌-II (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) పోస్టుల సంఖ్య: 16
  • ఆఫీసర్‌ స్కేల్‌-III (సీనియర్‌ మేనేజర్‌) పోస్టుల సంఖ్య: 220

IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, చార్టర్డ్‌ అకౌంటెన్సీ (CA), MBA తదితర విద్యార్హతలు ఉండాలి. నిర్దిష్ట పోస్టుకు అవసరమైన విద్యార్హతను అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆఫీసర్‌ స్కేల్‌-I పోస్టులకు 18–30 ఏళ్లు, ఆఫీసర్‌ స్కేల్‌-II పోస్టులకు 21–32 ఏళ్లు, ఆఫీసర్‌ స్కేల్‌-III పోస్టులకు 21–40 ఏళ్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 18–28 ఏళ్ల వరకు వయసు ఉండాలి. వయస్సును నోటిఫికేషన్‌లో పేర్కొన్న కటాఫ్‌ తేదీ ఆధారంగా లెక్కిస్తారు. రిజర్వేషన్‌ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 21, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ.175 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. పోస్టును బట్టి అభ్యర్థుల ఎంపికకు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌/సింగిల్‌ ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ వంటి ప్రక్రియలు ఉంటాయి. ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు ఉండగా, ఆఫీసర్‌ పోస్టులకు పోస్టును బట్టి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: సెప్టెంబర్‌ 21, 2026.
  • ఫీజు చెల్లింపు: సెప్టెంబర్‌ 21, 2026.
  • ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌: నవంబర్‌ 2026
  • ప్రిలిమినరీ పరీక్ష: నవంబర్‌/డిసెంబర్‌ 2026
  • ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబర్‌ 2026/జనవరి 2027
  • మెయిన్స్‌/సింగిల్‌ పరీక్ష: జనవరి 2027
  • మెయిన్స్‌/సింగిల్‌ ఫలితాలు: జనవరి 2027
  • ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2027
  • ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: ఫిబ్రవరి/మార్చి 2027

IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us