AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: చెప్పకుండా పెళ్లి చేసుకుందని గర్భంతో ఉన్న కూతురిని.. ఓటీటీలో ఈ రియల్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు

పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. ఇది కూడా కొన్నేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన ఓ దారుణమైన ఘటన నేపథ్యంలో తెరకెక్కింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కడుపుతో ఉన్న ఓ కూతురి పట్ల కన్న తండ్రి చూపించిన కర్కశత్వాన్ని ఈ సిరీస్ లో చూపించారు.

OTT Movie: చెప్పకుండా పెళ్లి చేసుకుందని గర్భంతో ఉన్న కూతురిని.. ఓటీటీలో ఈ రియల్ స్టోరీ చూస్తే కన్నీళ్లు ఆగవు
OTT Movie
Basha Shek
|

Updated on: Sep 17, 2026 | 8:32 AM

Share

ఈ మధ్యన ప్రముఖ వ్యక్తులు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో వస్తోన్న రియల్ క్రైమ్ స్టోరీలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక రియల్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన దారుణ ఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. కొన్నేళ్ల క్రితం తమిళనాడులో నిజంగానే జరిగిన కథ ఇది. సుమతి (సాయి పల్లవి) తండ్రి (ప్రకాష్ రాజ్) కు చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. భర్తతో కలిసి సుఖంగా సిటీలో బతుకుతుంటుంది. ఇదే క్రమంలో ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు రెడీగా ఉంటోంది. అయితే ఇంతలోనే తండ్రి ఆమెను వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. కొన్ని రోజులు ఆమెతోనే ఉండి సీమంతం చేస్తామంటూ కూతురిని ఇంటికి తీసుకెళతాడు. ఇక రేపు సీమంతం అనగా తండ్రిలోకి కర్కషుడు బయటకు వస్తాడు. అందరూ పడుకున్న తర్వాత పాలలో విషం కలిపి కూతురికి ఇస్తాడు. విషం తాగిన సుమతి రక్తం కక్కుకుని మరణిస్తుంది. పరువు కోసం కన్న తండ్రి చేసిన ఈ దారుణమైన దుశ్చర్య అందరినీ కంటతడి పెట్టిస్తుంది. మన చుట్టూ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అందరూ ముక్కున వేలేసుకుంటారు. ముఖ్యంగా చివరి అయిదు నిమిషాల్లో ప్రకాష్ రాజ్-సాయిపల్లవి నడుమ సన్నివేశాలు మనసును కదిలిస్తాయి.

కన్నీళ్లు పెట్టించే ఈ సిరీస్ పేరు ‘పావ కధైగల్’. అంటే పాపపు కథలు అని తెలుగులో అర్థం. ఇదొక ఆంథాలజీ వెబ్ సిరీస్. గౌరవం, పరువు, కులం, మతం, పితృస్వామ్య భావాల పేరుతో సమాజంలో జరిగే దారుణాలు, పరువు హత్యలు, సంక్లిష్టమైన మానవ సంబంధాల గురించి ఈ సిరీస్ లో చూపించారు. ఇందులో మొత్తం నాలుగు ఎపిసోడ్ లు ఉన్నాయి. అయితే అన్నిటికంటే ఆ రాత్రి అనే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, ప్రకాశ్ రాజ్ లు తండ్రీ కూతుళ్లుగా నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఒరిజినల్ తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

‘పావ కధైగల్’ వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us