AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: ‘ది ప్యారడైజ్’ లా గతంలో ట్రైలర్ లేకుండానే థియేటర్లలో రిలీజైన సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?

న్యాచురల్ స్టార్ నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ కు ముస్తాబైంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్ సినిమా డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

The Paradise: 'ది ప్యారడైజ్' లా గతంలో ట్రైలర్ లేకుండానే థియేటర్లలో రిలీజైన సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
The Paradise Movie
Basha Shek
|

Updated on: Sep 17, 2026 | 9:39 AM

Share

గత కొన్నేళ్లుగా సినిమా ప్రమోషన్స్ ట్రెండ్ మారిపోయింది. తమ సినిమా జనాల్లోకి బాగా తీసుకెళ్లేందుకు మేకర్స్ తరచూ ఏదో ఒక అప్డేట్ ఇచ్చేవారు. పోస్టర్, గ్లింప్స్, టీజర్, స్పెషల్ వీడియోలు, సాంగ్స్.. ఇక చివర్లో ట్రైలర్ విడుదల చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా ట్రైలర్ బట్టే సినిమాపై ఒక అంచనా వస్తుంది. సినిమా ఎలా ఉంటుందో, పాత్రలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ట్రైలర్ ముఖ్య ఆధారం. ఈ క్రమంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ లేకుండానే డైరెక్ట్ గా థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ది ప్యారడైజ్ కంటే ముందు కూడా పలు తెలుగు సినిమాలు ట్రైలర్ లేకుండానే థియేటర్లలో రిలీజయ్యాయి. మరి వాటి రిజల్ట్స్ ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం రండి. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది మహేష్ బాబు నటించిన ఖలేజా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ తర్వాతి క్రమంలో ఇదొక క్లాసిక్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ కూడా ట్రైలర్ లేకుండా థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్- రష్మిక ల క్రేజ్ ను అమాంతం పెంచేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ కూడా ట్రైలర్ లేకుండానే రిలీజై సంచలన విజయం సాధించింది. మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కోరాజా కూడా ఈ లిస్టులో ఉంది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. . శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘బ్రోచేవారెవరురా’ కూడా ట్రైలర్ లేకుండానే రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సర్కార్’ కూడా ట్రైలర్ లేకుండా థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఇప్పుడీ జాబితాలో నాని ది ప్యారడైజ్ సినిమా కూడా చేరింది. మరి ఇది సినిమాకు ప్లస్ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?