ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీలో కీలక మార్పులు.. ఇకపై అక్కడే తీసుకోవాలి!
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇకపై మీరు రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాలంటే మళ్లీ పాత విధానాన్నే ఫాలో అవ్వాలి.. అవును ఆధార్, రేషన్ కార్డులను నివాస రుజువులుగా ఉపయోగించాలని గతంలో తీసుకొచ్చిన జీవోను రద్దు చేస్తూ తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తహసిల్దార్ కార్యాలయంలోనే రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందవచ్చని కొత్త జీవో జారీ చేసింది.

నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ పాత విధానంలోనే రెసిడెన్స్ సర్టిఫికెట్‌లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నివాస ధ్రువీకరణపత్రాల జారీ అధికారాన్ని తహసీల్దార్లకు పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పత్రం కావాలంటే ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దారుకు సమర్పించాలని, ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దారు స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధ్రువీకరించి పత్రం జారీచేయాలని సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ప్రభుత్వం మొదటి నుంచి తహసీల్దార్ ద్వారా ఈ రెసిడెన్స్ సర్టిఫికెట్‌లను అందజేసింది. కానీ 2015 జూన్ 20న ఈ విధాన్ని మారుస్తూ.. ఆధార్, రేషన్ కార్డులను నివాస రుజువులుగా ఉపయోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణపత్రాల జారీని అనేది నిలిచిపోయింది.
అయితే విద్య, ఉద్యోగాలు, ఓటరు జాబితాలో పేరు నమోదుకు స్థానిక గుర్తింపు అవసరం అవ్వడంతో ప్రజలు మళ్లీ నివాస ధ్రువీకరణ పత్రాల్ని అందజేయాలని కోరుతున్నారు. దీంతో తాజాగా ఈ విషయం దృష్టిసారించిన ప్రభుత్వం.. 2015 జూన్ 20న ఇచ్చిన జీవోను రద్దుచేస్తూ మళ్లీ పాత విదానమైన తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాల జారీ చేయడాన్ని పునరుద్ధరించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
