AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు.. ఎంత తగ్గిందంటే..!

Petrol, Diesel: పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ లభ్యతను కాపాడటం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎగుమతులను నియంత్రించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ ఎగుమతి లెవీలను అమలు చేస్తోంది. 2026 మార్చి 27 నుంచి ఈ ఎగుమతి లెవీల విధానం అమల్లోకి వచ్చింది..

Petrol, Diesel: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు.. ఎంత తగ్గిందంటే..!
Fuel Export Duty
Subhash Goud
|

Updated on: Sep 17, 2026 | 8:25 AM

Share

Petrol, Diesel: పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విధించే సుంకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి సవరించింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు విమాన ఇంధనం (ATF)పై ఎగుమతి లెవీలను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 16న నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజా మార్పులు వెంటనే అమల్లోకి వచ్చాయి.

డీజిల్‌పై రూ.5 తగ్గింపు

తాజా నిర్ణయం ప్రకారం డీజిల్ ఎగుమతులపై మొత్తం లెవీని లీటరుకు రూ.25 నుంచి రూ.20కి తగ్గించారు. అంటే ఒక్క లీటర్‌పై రూ.5 మేర సుంకం తగ్గింది. ఇందులో స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED)ను రూ.24 నుంచి రూ.20కి తగ్గించడంతో పాటు, గతంలో ఉన్న రూ.1 రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను పూర్తిగా తొలగించారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. తులం ధర ఎంతంటే..!

ఇవి కూడా చదవండి

పెట్రోల్‌పై రూ.1 తగ్గింపు

పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న లెవీని కూడా కేంద్రం తగ్గించింది. సెప్టెంబర్ 1న లీటరుకు రూ.1.50గా ఉన్న ఈ సుంకాన్ని ఇప్పుడు రూ.0.50కి తగ్గించారు. అంటే లీటరుకు రూ.1 మేర తగ్గింపు లభించింది.

ATFపై కూడా తగ్గిన సుంకం

విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై లెవీని లీటరుకు రూ.19 నుంచి రూ.15కి తగ్గించారు. దీంతో ATFపై కూడా రూ.4 మేర ఎగుమతి సుంకం తగ్గింది.

దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఉంటుందా?

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ తాజా మార్పులు ఎగుమతులపై విధించే సుంకాలకు మాత్రమే సంబంధించినవి. దేశీయ మార్కెట్లో వినియోగించే పెట్రోల్, డీజిల్‌పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు చేయలేదు. అందుకే ఈ నిర్ణయం వల్ల పెట్రోల్ బంకుల్లో వినియోగదారులు చెల్లించే ధరలు నేరుగా తగ్గుతాయని చెప్పలేం.

రెండు వారాలకు ఒకసారి సుంకాల సమీక్ష

పెట్రోల్, డీజిల్, ATF వంటి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విధించే లెవీలను కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి సమీక్షిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ATF ధరల్లో వచ్చే మార్పులను పరిగణనలోకి తీసుకుని ఈ రేట్లను సవరిస్తోంది.

ఎందుకు ఈ సుంకాలు విధిస్తున్నారు?

పెట్రోలియం ఉత్పత్తుల దేశీయ లభ్యతను కాపాడటం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఎగుమతులను నియంత్రించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ ఎగుమతి లెవీలను అమలు చేస్తోంది. 2026 మార్చి 27 నుంచి ఈ ఎగుమతి లెవీల విధానం అమల్లోకి వచ్చింది.

మొత్తంగా చూస్తే.. తాజా నిర్ణయంతో పెట్రోల్ ఎగుమతి సుంకం రూ.1.50 నుంచి రూ.0.50కి, డీజిల్ ఎగుమతి లెవీ రూ.25 నుంచి రూ.20కి, ATF ఎగుమతి సుంకం రూ.19 నుంచి రూ.15కి తగ్గాయి. అయితే దేశీయ వినియోగదారుల కోసం పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు.

ఇది కూడా చదవండి: Personal Finance: రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. 20 ఏళ్ల తర్వాత ఎవరు కోటీశ్వరులు? లెక్కలు చూస్తే షాక్!

ఇది కూడా చదవండి: Chanakya Niti: శత్రువును పిచ్చివాడిని చేసే 7 ప్రమాదకరమైన ఎత్తుగడలు.. చాణక్య నీతి నుండి నేర్చుకోవలసిన పాఠాలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us