కొత్త చెక్‌బుక్‌లు వచ్చేస్తున్నాయ్... ఫీచర్లు చూస్తే అదుర్స్..
Venkatrao Lella
Images: Pinterest
14 Sep 2026
భారతదేశంలో చెక్ పేమెంట్‌ల భద్రత, విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మార్పులు 2027 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త రూల్స్ ఏంటంటే..
వినియోగదారులు డిసెంబర్ 31వ తేదీలోగా తమ వద్ద ఉన్న పాత చెక్ బుకులను మార్చుకోవాలి. డిసెంబర్ 31 తర్వాత అవి పనిచేయవు. దీంతో కొత్త వాటిని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి.
చెక్ ట్యాంపరింగ్, నకిలీ చెక్కులు, ఫోర్జరీలను నిరోధించడానికి కొత్త చెక్ బుక్‌లలో అదనపు భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఆల్ఫాన్యూమరిక్ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. అంటే చెక్ నంబర్లు అక్షరాలు. అంకెల కలయికలో ఉంటాయి.
వాటర్ మార్క్, మైక్రో ప్రింటింగ్, యూవీ లైట్ కింద మాత్రమే కనిపించే ప్రత్యేక భద్రతా సింబల్స్ కూడా ఉంటాయి. ఈ ఫీచర్లు చెక్ జెన్యూనా కాదా అని బ్యాంకులు సులభంగా ధృవీకరించడానికి సహాయపడతాయి
పాజిటివ్ పే సిస్టమ్ అనేది చెక్ ఫ్రాడ్‌లను నిరోధించడానికి రూపొందించిన ఒక ముఖ్యమైన యంత్రాంగం. ఈ సిస్టమ్ కింద అధిక విలువ గల చెక్కులను జారీ చేసే ముందు ముఖ్యమైన వివరాలను సేకరిస్తారు.
కస్టమర్‌లు చెక్కుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను (చెక్కు నంబర్, తేదీ, లబ్ధిదారుని పేరు, మొత్తం) తమ బ్యాంక్‌కు ముందుగానే తెలియజేయాలి. బ్యాంక్ ఆ వివరాలను అందుకున్న చెక్కుతో సరిపోల్చి, ఏవైనా తేడాలు ఉంటే తిరస్కరిస్తుంది
చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) చెక్ క్లియరింగ్ ప్రక్రియను విప్లవాత్మకంగా మారుస్తుంది. ఇంతకుముందు చెక్కులు ఫిజికల్‌గా ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంక్‌కు తరలించబడేవి. CTSతో, చెక్ ఇమేజ్‌లు మరియు సంబంధిత వివరాలు డిజిటల్‌గా బదిలీ చేయబడతాయి.
చెక్ జారీ చేసిన తేదీ నుండి మూడు నెలల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ నియమం చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు, సెప్టెంబర్ 1న జారీ చేయబడిన చెక్ నవంబర్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది
డిసెంబర్ 31వ తేదీతో పాత చెక్ బుక్‌లు అన్నీ ఇన్వాలిడ్ అవుతాయన్న విస్తృత ప్రచారం ఉంది. అయితే అన్ని బ్యాంక్‌ల పాత చెక్ బుక్‌లు ఈ తేదీ నాటికి స్వయంచాలకంగా చెల్లుబాటు కోల్పోతాయని నిర్దిష్ట ధృవీకరణ లేదు.