AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో సర్కార్ కొలువులు

రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB AP) 1,156 కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష, PMT, PET, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది..

ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో సర్కార్ కొలువులు
AP Police Constable Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 17, 2026 | 8:04 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) నిరుద్యోగులకు కీలక ప్రకటన చేసింది. పోలీస్ శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖ, జైళ్లు అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖల్లో 1156 కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

  • SCT పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – పురుషులు/మహిళలు పోస్టుల సంఖ్య: 542
  • SCT పోలీస్ కానిస్టేబుల్ (AR) – పురుషులు/మహిళలు పోస్టుల సంఖ్య: 285
  • ఫైర్‌మెన్ – పురుషులు పోస్టుల సంఖ్య: 158
  • వార్డర్లు – పురుషులు పోస్టుల సంఖ్య: 150
  • వార్డర్లు – మహిళలు పోస్టుల సంఖ్య: 21

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1, 2026 నాటికి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చదివి పరీక్షలకు హాజరై ఉండాలి. పోస్టుకు అనుగుణంగా నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. అలాగే జూలై 1, 2026 నాటికి కానిస్టేబుల్ సివిల్, ఏఆర్ పోస్టులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే 2002 జూలై 2 నుంచి 2008 జూలై 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు. ఫైర్‌మెన్, వార్డర్ తదితర ఇతర పోస్టులకు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది. మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వితంతువులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు సడలింపులు వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి స్టేజ్-I అప్లికేషన్ పూర్తి చేయాలి. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన తర్వాత స్టేజ్-II అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్స్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ఓసీ (EWSతో సహా), బీసీ (AP లోకల్), నాన్-లోకల్ అభ్యర్థులు రూ.300, ఎస్సీ/ఎస్టీ (AP లోకల్) అభ్యర్ధులు రూ.150 చొప్పున చెల్లించాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు జీతంగా చెల్లిస్తారు.

ప్రిలిమినరీ, తుది రాత పరీక్షలు 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్, పదో తరగతి స్థాయి అరిథ్‌మెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, కల్చర్, నేషనల్ మూవ్‌మెంట్, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జాతీయ-అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమకాలీన అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. PMTలో అభ్యర్థుల ఎత్తు, పురుషుల ఛాతీ కొలతలు, మహిళల బరువు తదితర శారీరక ప్రమాణాలను పరిశీలిస్తారు. Tలో 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ వంటి ఈవెంట్లు ఉంటాయి. దరఖాస్తు ప్రారంభ, ముగింపు తేదీలు, రాత పరీక్ష తేదీలను AP SLPRB త్వరలో ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us