AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎంత కష్టం వచ్చిందో పాపం.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగుచూసింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ కుటుంబం. వీరిలో తండ్రి, కూతురు మరణించగా.. ప్రస్తుతం కుమారుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వారి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: ఎంత కష్టం వచ్చిందో పాపం.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
Khammam Family Suicide
Anand T
|

Updated on: Sep 17, 2026 | 8:25 AM

Share

పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం.. కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్ ఉన్నారు. అయితే ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. నిన్న సాయంత్రం శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాను తాగి, ఇద్దరు పిల్లలకూ తాగించాడు. కాసేపటికే వారంతా స్పృహ కోల్పోయారు.

వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే తండ్రి శ్రీనివాసరావు, కుమార్తె లాస్య కన్నుమూశారు. కుమారుడు నిఖిల్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం నిఖిల్‌ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. శ్రీనివాసరావు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారా? ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..
ఎడారిలో పిల్లల కోసం నీటిని మోసుకొచ్చే పక్షి..
ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..
ఆ గ్రామంలో రాత్రికి రాత్రే మిస్సవుతున్న కోళ్లు, మేకలు..
కుంచించుకుపోతున్న బుధ గ్రహం! అసలు కారణమేంటి..?
కుంచించుకుపోతున్న బుధ గ్రహం! అసలు కారణమేంటి..?
‌52 సిక్సర్లతో 892 పరుగులు.. సూర్య రికార్డ్‌పై కన్నేసిన ఇషాన్..!
‌52 సిక్సర్లతో 892 పరుగులు.. సూర్య రికార్డ్‌పై కన్నేసిన ఇషాన్..!
పల్లవి ప్రశాంత్ చెల్లెలు అంటూ సింగర్ ఝాన్సీ పై ట్రోల్స్
పల్లవి ప్రశాంత్ చెల్లెలు అంటూ సింగర్ ఝాన్సీ పై ట్రోల్స్