AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్

కోలీవుడ్ టాప్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తండ్రిలా హీరోలా కాకుంగా ఏకంగా మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు జేసన్ సంజయ్.

Jason Sanjay: తెలుగులో ఆ రెండు సినిమాలు నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్.. ఆసక్తికర విషయం చెప్పిన జేసన్ సంజయ్
Jason Sanjay
Basha Shek
|

Updated on: Sep 17, 2026 | 6:49 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్ సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సిగ్మా’ చిత్రంతో సంజయ్ మెగాఫోన్ పట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సిగ్మా సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ జేసన్ సంజయ్, హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్ధుల్లాతో పాటు చిత్ర బృందమంతా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు జేసన్. ఇదే క్రమంలో తెలుగు సినిమాలపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాలలంటే తనకు చాలా ఇష్టమని, ఇవి తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్ అని విజయ్ కుమారుడు తెలిపాడు.

ఇదే ప్రెస్ మీట్ లో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు జేసన్ సంజయ్– ‘నేను కాలేజీలో డైరెక్షన్, స్క్రీన్‌ రైటింగ్‌ చదువుకున్నాను. సినిమా ప్రయాణంలో 24 క్రాఫ్ట్స్‌తో కలిసి పని చేశాను. ఈ ప్రయాణంలో మా నాన్న (విజయ్‌), నా కుటుంబం, అభిమానులు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. ఇక ‘మైఖేల్’ సినిమాలో సందీప్ కిషన్ నటన నచ్చడంతోనే ‘సిగ్మా’ కోసం ఆయనను హీరోగా ఎంపిక చేసుకున్నాను. నేను ఎలాంటి సినిమా చేశానో చూడటానికి మా నాన్నగారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని సంజయ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

జేసన్ సంజయ్ లేటెస్ట్ ఫొటోస్..

కాగా లైకాప్రొడక్షన్స్‌ పై సుభాస్కరన్‌ తెలుగు–తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుంది. ఎన్‌వీఆర్‌ సినిమా సీడెడ్‌లో రిలీజ్‌ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నవంబర్ 2026 మిథున రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో సానుకూలత
నవంబర్ 2026 మిథున రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో సానుకూలత
నవంబర్ 2026 వృషభ రాశి మాసఫలాలు.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
నవంబర్ 2026 వృషభ రాశి మాసఫలాలు.. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
11 సినిమాలతో మొదలై.. స్పెషల్ సాంగ్స్‌తో సెన్సేషన్..
11 సినిమాలతో మొదలై.. స్పెషల్ సాంగ్స్‌తో సెన్సేషన్..
ముక్కు మీద ఏర్పడే నల్లటి గీతలను తొలగించే సులువైన ఇంటి చిట్కాలు!
ముక్కు మీద ఏర్పడే నల్లటి గీతలను తొలగించే సులువైన ఇంటి చిట్కాలు!
ఒకప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ నటి.. కట్ చేస్తే
ఒకప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ నటి.. కట్ చేస్తే
నవంబర్ 2026 మేష రాశి మాసఫలాలు..ఉద్యోగంలో పదోన్నతి యోగం!
నవంబర్ 2026 మేష రాశి మాసఫలాలు..ఉద్యోగంలో పదోన్నతి యోగం!
విద్యార్థులకు గంజాయి సరఫరా.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్
విద్యార్థులకు గంజాయి సరఫరా.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్
దాబా స్టైల్ ఎగ్‌ మసాలా.. ఇలా చేస్తే ఎన్ని సార్లు తిన్నా..
దాబా స్టైల్ ఎగ్‌ మసాలా.. ఇలా చేస్తే ఎన్ని సార్లు తిన్నా..
నాభిలో నూనె రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?ఆరోగ్య, సౌందర్య లాభాలు
నాభిలో నూనె రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?ఆరోగ్య, సౌందర్య లాభాలు
స్మార్ట్ రింగ్ వర్సెస్ టెంపుల్ డివైజ్.. మానసిక ఒత్తిడిని కొలిచే
స్మార్ట్ రింగ్ వర్సెస్ టెంపుల్ డివైజ్.. మానసిక ఒత్తిడిని కొలిచే