AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Afg: క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమిండియా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం

Ind Vs Afg: అఫ్గానిస్తాన్‌తో మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా చూస్తోంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో తుది జట్టులో మేనేజ్‌మెంట్ కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీ, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్‌లకు ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది.

Ind Vs Afg: క్లీన్  స్వీప్ పై కన్నేసిన టీమిండియా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
Ind Vs Afg
Rakesh
|

Updated on: Sep 17, 2026 | 9:02 AM

Share

Ind Vs Afg: భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో అద్భుత విజయాలు సాధించిన అయ్యర్ సేన 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసి సిరీస్‌ను ఘనంగా ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, అలాగే పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రయోగానికి సిద్దమైన మేనేజ్‌మెంట్

ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో.. ఆఖరిదైన ఈ మూడో టీ20 మ్యాచ్‌లో తుది జట్టు కూర్పుపై టీమిండియా మేనేజ్‌మెంట్ కొన్ని కీలక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన యంగ్ ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైనా, రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చిన సంజు సామ్సన్‌తో పాటు ఇతరులకు తుది జట్టులో ఛాన్స్ దక్కవచ్చు. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ చేయబోయే మూడు పెద్ద మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ?

జింబాబ్వే టూర్‌లో అద్భుతంగా రాణించి రెండు హాఫ్ సెంచరీలు బాదిన 15 ఏళ్ల రికార్డు వీరుడు వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే భారత్ సిరీస్ గెలుచుకున్నందున, ఓపెనర్లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి వైభవ్‌కు తుది జట్టులో అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. సంజు శామ్సన్‌కు మరికొంత గేమ్‌టైమ్ అవసరం కాబట్టి, ఇన్-ఫామ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి విశ్రాంతినిచ్చి వైభవ్‌ను బరిలోకి దించే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉంది.

స్పిన్ ఆప్షన్‌గా వాషింగ్టన్ సుందర్ రాక?

గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు ఇప్పటివరకు ఆడే అవకాశం దక్కలేదు. అయితే ఈ ఆఖరి మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో బిష్ణోయ్‌ని ఆడించినప్పటికీ, ఆఫ్‌స్పిన్ ఆప్షన్‌ను బ్యాలెన్స్ చేయడానికి సుందర్‌కు అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా యశ్ ఠాకూర్ ఎంట్రీ?

ప్రధాన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అజేయ ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో, బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చి యువ పేసర్ యశ్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జూలైలో జింబాబ్వెపై అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనే నాలుగు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఇప్పుడు బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు.

మూడో టీ20 కోసం భారత్ ప్లేయింగ్ ఎలెవన్

వైభవ్ సూర్యవంశీ, సంజు శామ్సన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?