AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC: ఈజీగా కనిపించింది.. కానీ ఆన్సర్ చెప్పడమే కష్టం.. కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయాల ప్రశ్న.. ఆన్సర్ ఏంటో మీకు తెలుసా..?

కౌన్ బనేగా కరోడ్ పతి షోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు దాదాపు 17 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈషో.. ఇప్పుడు 18వ సీజన్ నడుస్తుంది. అయితే తాజాగా కంటెస్టెంట్ అర్పిత కోటి రూపాయాలు గెలుచుకునే క్రమంలో చివరి మెట్టుపై వెనకడుగు వేశారు. కేవలం రూ.50 లక్షలతో ఇంటికి వెళ్లిపోయారు. ఆమె వద్ద ఎలాంటి లైఫ్ లైన్ లేకపోవడంతో ఆట నుంచి తప్పుకున్నారు.

KBC: ఈజీగా కనిపించింది.. కానీ ఆన్సర్ చెప్పడమే కష్టం.. కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయాల ప్రశ్న.. ఆన్సర్ ఏంటో మీకు తెలుసా..?
Kbc 1 Crore Question
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2026 | 10:25 AM

Share

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) 18వ సీజన్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సీజన్‌లోని శుక్రవారం ఎపిసోడ్‌లో వచ్చిన ఒక కంటెస్టెంట్ కథ విని అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే అర్పిత అనే అమ్మాయి 50 లక్షల రూపాయలు గెలుచుకోవడంతో షో ముగిసింది. ఆమె తదుపరి ప్రయాణాన్ని సోమవారం ఎపిసోడ్‌లో చూపించారు. ఆ సమయంలో ఆమె 1 కోటి రూపాయల కోసం ఆడుతుండగా.. అప్పటికే తనకు కేటాయించిన లైఫ్ లైన్స్ అన్నీ ఉపయోగించుకుంది. తన తండ్రిపై ఉన్న అప్పు, ఇంటి ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, తన తల్లిదండ్రులకు సంతోషకరమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడమే తన పెద్ద కల అని ఆమె చెప్పింది. అయితే కోటి రూపాయాల ప్రశ్న అడిగే సమయానికి ఆమె వద్ద లైఫ్ లైఫ్ ఏదీ మిగిలి లేదు. దీంతో కోటి ప్రశ్నకు ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే ఆమె ఆట నుంచి తప్పుకుంది. అయితే ఆ తర్వాత ఆమెను ఒక ఆన్సర్ సెలక్ట్ చేసుకోమన్నారు.

కోటి రూపాయల కోసం అర్పితను అడిగిన ప్రశ్న ఏంటంటే.. “ఆగస్టు 2026 నాటికి, ఏ దేశంలో మహిళ అధ్యక్షురాలు ప్రధానమంత్రి, పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేస్తున్నారు? ” అని అడగ్గా.. (ఎ) ఇటలీ (బి) ఐస్లాండ్ (సి) లాట్వియా (డి) మాల్టా ఆన్సర్స్ ఇచ్చారు.

అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేవలం రూ.50 లక్షల వద్ద ఆట నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమెను ఆన్సర్ చెప్పమని అమితాబ్ అడగ్గా.. ఆమె లాట్వియా అని చెప్పింది. అయితే ఆమె ఇచ్చిన ఆన్సర్ తప్పు అని.. ఆ ప్రశ్నకు ఆన్సర్ “ఐస్ లాండ్” అని అన్నారు అమితాబ్.

కోటి రూపాయాల ప్రశ్నకు ఆన్సర్ ఐస్ లాండ్. హాలా టోమాస్డోటిర్ 2024 నుండి ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా ఉన్నారు. క్రిస్ట్రూన్ ఫ్రాస్ట్‌డోటిర్ 2024 నుండి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే, థోరున్ స్వెన్‌బ్యార్నార్డోటిర్ 2025 నుండి ఐస్‌లాండ్ పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

కోటి రూపాయాల ప్రశ్న..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us