Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆ పోస్ట్‌లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. షాకింగ్ విషయం చెప్పిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ నటుడు ప్రభాస్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. 2023లో డార్లింగ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ 2024లో మళ్లీ కల్కి సినిమా మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Prabhas: ఆ పోస్ట్‌లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. షాకింగ్ విషయం చెప్పిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌
Prithviraj Sukumaran, Prabh
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 04, 2025 | 2:02 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు. రీసెంట్ డేస్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో సూపర్ హిట్ ఆ అందుకున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో మరో హీరోగా మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ కల్కి సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా ఏకంగా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు.

ఇక ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో సలార్ 2, కల్కి 2, రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలను లైనప్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రెటీలందరూ ప్రభాస్ ను తెగ పొగిడేస్తుంటారు. ప్రభాస్ మంచితనం గురించి.. ప్రభాస్ పంపించే ఫుడ్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. తాజాగా నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు.

అలాగే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  మాట్లాడుతూ.. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. అతనికి చిన్న చిన్న ఆనందాలు ఎక్కువ ఇష్టం. స్టార్ డమ్ గురించి అస్సలు పట్టించుకోడు. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. ఇన్ స్టా గ్రామ్ లో ప్రభాస్ అకౌంట్ నుంచి షేర్ అయ్యే పోస్ట్ లు కూడా ప్రభాస్ షేర్ చేసేవి కాదు. ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశ పరిచినందుకు క్షమించండి అని అన్నారు పృథ్వీరాజ్‌. ప్రభాస్ ఎక్కువగా ఫామ్‌హౌస్‌లో సంతోషంగా ఉంటాడు. ఎక్కడైనా మొబైల్‌ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అడుగుతుంటాడు. అంత పెద్ద స్టార్ అయ్యుండి చిన్న చిన్న ఆనందాలను ఇష్టపడటం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అన్నారు. అలాగే సలార్ 2 త్వరలోనే ఈ సినిమా రానుందని అన్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో వస్తున్న లూసిఫర్‌2: ఎంపురాన్‌ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి