Shriya Saran: మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెరవనున్న శ్రియ.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.?
టాలీవుడ్ లో ఏలిన హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ కలిసి నటించింది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ వయ్యారి భామ. దాదాపు అందరూ స్టార్స్ తో నటించిన శ్రియ ప్రస్తుతం సినిమాలు తగ్గించింది.

యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది వయ్యారి భామ శ్రియ. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో స్టార్ హీరోలు కూడా ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూసేవారు అప్పట్లో అంత బిజీగా గడిపింది శ్రియ. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. నటనతో పాటు అందంలోనూ ఈ అమ్మడు అదరగొట్టింది. ఇక ఇప్పుడు నాలుగు పదుల వయసులోనూ శ్రియ తన అందాలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శ్రియ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
అడపదడపా సినిమాల్లో నటిస్తుంది. మొన్నామధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న రోల్ లో కనిపించింది. ఇక ఇప్పుడు భర్త కూతురితో సమయాన్ని గడుపుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు అంతగా అవకాశాలు లేక ఫ్యామిలీతో విదేశాల్లో గడుపుతోంది. ఇదిలా ఉంటే శ్రియ ఫామ్‌లో ఉన్నప్పుడు హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి శ్రియ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఓ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో శ్రియ నటిస్తుందని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ టాప్ హీరో సూర్య. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో శ్రియ నటిస్తుందని తెలుస్తుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి