AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్‌ ఫేమ్‌ శేఖర్‌ బాషా పై ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆధారాలతో సహా పోలీసుల ముందుకు

మస్తాన్ సాయి..వాడి దృష్టిలో ఆడపిల్ల..ఆటబొమ్మ రెండూ ఒక్కటే. వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం...అనుభవించడం వీడి స్టైల్ ఆఫ్ శాడిజం. సైకోకుమించిన చేష్టలతో అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటూ....బతికేస్తున్నాడు. మరి ఇంత జరుగుతున్నా వీడిపై బాధిత మహిళలు ఎందుకు ఫిర్యాదు చేయలేదు...వీడంటే భయమా..? లేక వీడి చేతిలో ఉన్న వీడియోలంటే భయమా..?

బిగ్‌బాస్‌ ఫేమ్‌ శేఖర్‌ బాషా పై ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆధారాలతో సహా పోలీసుల ముందుకు
Rj Shekar Basha
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2025 | 2:46 PM

Share

మరోసారి నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది లావణ్య. ఈసారి లావణ్య బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఆర్‌జే శేఖర్‌ బాషాపై ఫిర్యాదు చేసింది.  తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా యత్నించారని లావణ్య ఆరోపించింది. అంతే కాదు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా ఆడియోలను కూడా పోలీసులకు అందజేసింది లావణ్య. హీరో రాజ్‌తరుణ్ -లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. ఓరకంగా లావణ్య పెంచి పోషించిన జాదూగాడు ఈమస్తాన్ సాయి.

రాజ్‌ తరుణ్-లావణ్య ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత దుమారం రేపిందో..అందరికీ తెలుసు. ఇప్పుడు అంతకుమించిన దుమారం ఈమస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లు రేపుతున్నాయి. హీరోల ప్రైవేట్ వీడియోలు కూడా వీడిదగ్గరున్నాయి. అతని బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారంపై గతంలో పదేపదే ఆరోపించినా సరైన ఆధారాలు లావణ్య దగ్గర లేవు. ఆ ఆధారాల సేకరణకోసమే మస్తాన్ సాయి నుంచి హార్డ్ డిస్క్ తీసుకుంది లావణ్య. తనకు సంబంధించి ఆధారాల కోసం వెతుకుతుంటే.. అదే హార్డ్‌ డిస్క్‌లో మైండ్ బ్లాంక్ అయ్యేలా వీడియోలు బయటపడ్డాయి.

వీడి ట్రాప్‌లో పడి వందలమంది ఆడపిల్ల జీవితాలు నాశనమయ్యాయి. ప్రేమ , పెళ్లి, యూట్యూబ్‌ల్లో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వలవేస్తాడు. నెమ్మదిగా వారిని ట్రాప్‌ చేసి తనవైపు తిప్పుకుంటాడు. అంతటితో ఆగలేదు వీడి ఆగడాలు. ఆడపిల్లలకు డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు. అంతేకాదు అందరితోనూ న్యూడ్ కాల్స్ చేపించి..వాటిని రికార్డ్ చేసేవాడు. తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి..వారిని అనుభవించేవాడు. బాత్రూమ్‌ల్లో, బెడ్‌రూమ్‌ల్లో స్పై కెమెరాలను ఫిక్స్ చేసి లేడీస్ నగ్నవీడియోలను రికార్డ్ చేసేవాడు. అంతేనా హీరోల పోన్లను హ్యాక్ చేసి వారి ప్రైవేట్ వీడీయోలను సైతం తన హార్డ్‌ డిస్క్‌ల్లో స్టోర్ చేసేవాడు. వాడి బాధితుల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హీరో నిఖిల్. నిఖిల్‌కు సంబంధించిన ఓ ప్రైవేట్ పార్టీకి సంబంధిచిన వీడియో కూడా వీడి డిస్క్‌లో స్టోర్అయిందట. అంతేకాదు వరలక్ష్మీ టిఫన్ సెంటర్ ఓనర్ ప్రబాకర్ రెడ్డి ఫోనును కూడా హ్యాక్ చేసాడు మస్తాన్. వాళ్ల ప్రైవేట్ జీవితాలను రికార్డ్ చేసి అవసరమైనప్పుడు బ్లాక్‌మెయిల్ చేసేవాడని లావణ్య చెబుతోంది. హార్డ్ డిస్క్‌ల కోసం తనను చంపేందుకు ప్రయత్నించాడని లావణ్య మస్తాన్‌సాయిపై కేసు ఫైల్ చేసింది. అయితే మస్తాన్ సాయి వెర్షన్ మరోలా ఉంది. డిస్క్‌ల్లో దొరికిన వీడియోల్లో తనవేమీ లేవని.. యువతుల అనుమతితోనే తాను కొన్ని వీడియోలు రికార్డ్ చేశానని చెబుతున్నాడు. ఇందులో తనతప్పులేదన్నది మస్తాన్ సాయి వాదన.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి