Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: సలార్ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ప్రభాస్‍ను ఢీకొట్టనున్న మలయాళీ స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్..

కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్‏ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ మూవీ చేస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.

Salaar: సలార్ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ప్రభాస్‍ను ఢీకొట్టనున్న మలయాళీ స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్..
Salaar Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 16, 2022 | 10:51 AM

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ చిత్రంపైనే ఉన్నాయి. బాహుబలి వంటి సెన్సెషన్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‏గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమా సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‏ను డైరెక్టర్స్ తెరకెక్కిస్తోన్న చిత్రాలపై డార్లింగ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. దీంతో కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్‏ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ మూవీ చేస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ ఈ మూవీ నుంచి అప్డేట్ లేదా టీజర్ రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అభిమానులకు బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాలో ప్రభాస్ కు ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారంటూ అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అతని పేరు వరద రాజు మన్నార్ అని తెలిపింది చిత్రయూనిట్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటిస్తున్నారంటూ ముందునుంచే వార్తలు వినిపించాయి. ఇటీవల తాను నటించిన కడువ చిత్రప్రమోషన్లలోనూ పృథ్వీరాజ్ సలార్ సినిమా ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానంటూ చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..
ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్.. ఇప్పుడు మొదటి సినిమాతోనే 50 కోట్లు
ఇన్‌స్టా రీల్స్‌తో ఫేమస్.. ఇప్పుడు మొదటి సినిమాతోనే 50 కోట్లు