AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ కారణంతోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో నటించట్లేదు.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న పేరు) ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఓ స్టార్ హీరో.

Tollywood : ఆ కారణంతోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో నటించట్లేదు.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో..
Dragon Movie
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2026 | 8:09 PM

Share

జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డ్రాగన్ (ప్రచారంలో ఉన్న పేరు). డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కన్నడ తార రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. కొన్ని నెలలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇందులో నటించే నటీనటుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అడియన్స్. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం మలయాళీ నటుడు టొవినో థామస్ నటించనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు టోవినో థామస్. తన కొత్త సినిమా పళ్లిచట్టంబి ప్రమోషన్లలో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో టొవినో థామస్ స్పందించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

మలయాళంలో వేరే సినిమాలు చేస్తుండడంతో డేట్స్ సర్దుబాటు కాక డ్రాగన్ సినిమాలో నటించట్లేదని అన్నారు. తెలుగు సినిమాల్లో నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నానని.. కానీ మలయాళంలో వర్కింగ్ కల్చర్.. టాలీవుడ్ కు భిన్నంగా ఉంటుందని అన్నారు. తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేస్తాం.. తెలుగు సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువ ఉంటాయి. పైగా ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా చేస్తుంటా.. ఒకవేళ నేను టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమాలో నటిస్తే.. నేను ఒకే చేసిన నాలుగు మలయాళ సినిమాలపై ప్రభావం పడుతుంది. అందుకే తెలుగు సినిమాలు చేయలేకపోతున్నా అని చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

ప్రస్తుతం టొవినో థామస్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. టొవినో థామస్ సినిమాల విషయానికి వస్తే.. దాదాపు 15 సంవత్సరాలుగా మలయాళీ చిత్రపరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 55కి పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వంలో పళ్లిచట్టంబి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని తెలుగులో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నారు.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Follow Us