వరుస ఫ్లాపులతో డైలమాలో పడ్డ హాట్ బ్యూటీ కెరీర్.. 

Rajeev 

31  march 2026

అందంలో అప్సరస ఆమె.. నటనలోనూ ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారింది.

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది.

కానీ ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది.

 ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమాలో నటించింది. దాంతో ఈ అమ్మడి దశ తిరిగిపోతుందని అందరూ అనుకున్నారు. 

కానీ  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాంతో ప్రభాస్ సినిమాలో ఆశలు పెట్టుకుంది. 

రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా నిధి అగర్వాల్ కు సక్సెస్ ఇవ్వలేకపోయింది.. దాంతో ఈ హాట్ బ్యూటీ కెరీర్ డైలమాలో పడింది.