Kaduva: ఐదు భాషలలో రిలీజ్ కానున్న పృథ్వీరాజ్ సినిమా.. ‘కడువా’ విడుదల ఎప్పుడంటే..

మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘పక్కా కమర్షియల్‌’, ‘ఒకే ఒక జీవితం’ చిత్రాలకు సంగీతం అందించిన జేక్స్ బిజోయ్

Kaduva: ఐదు భాషలలో రిలీజ్ కానున్న పృథ్వీరాజ్ సినిమా.. 'కడువా' విడుదల ఎప్పుడంటే..
Kaduva
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 21, 2022 | 3:08 PM

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కడువా (Kaduva). మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో పృథ్విరాజ్ సుకుమారన్ జోడీగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‏గా రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్.. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్రలో నటించారు.

మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘పక్కా కమర్షియల్‌’, ‘ఒకే ఒక జీవితం’ చిత్రాలకు సంగీతం అందించిన జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. అర్జున్ అశోఖ్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్, తదితరులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.