AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ మీ సొంతమవుతుంది.. ఎలాగంటే..

ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరచగా.. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సలార్ మూవీలో డార్లింగ్ నటవిశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఇందులో శ్రుతిహాసన్, జగపతి బాబు కీలకపాత్రలో పోషించగా.. ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించారు.

Salaar Movie: ఆ ఒక్క పనిచేస్తే చాలు.. సలార్ సినిమాలో ప్రభాస్ బైక్ మీ సొంతమవుతుంది.. ఎలాగంటే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2024 | 9:24 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిత్రం సలార్. గతేడాది డిసెంబర్‏లో రిలీజ్ అయిన ఈ మూవీ సాలిడ్ హిట్ టాక్ అందుకుంది. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్ 1 సీజన్ ఫైర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరచగా.. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సలార్ మూవీలో డార్లింగ్ నటవిశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఇందులో శ్రుతిహాసన్, జగపతి బాబు కీలకపాత్రలో పోషించగా.. ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించారు. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ అటు ఓటీటీల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇన్నాళ్లు థియేటర్లు, ఓటీటీలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది. ఏప్రిల్ 21న సాయంత్రం 5.30 నిమిషాలకు ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మాలో సలార్ మూవీ ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే సలార్ టీమ్ సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రేక్షకులకు ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేసింది. అసలు విషయమేంటంటే.. సలార్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన ఐకానిక్ బైక్ గెలుచుకునే అవకాశం అంటూ పోస్ట్ చేసింది చిత్రయూనిట్. స్టార్ మాలో సలార్ సినిమా ప్రసారమయ్యే సమయంలో ఇచ్చిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పినవారికి ఆ బైక్ గెలిచే అవకాశముంటుందని తెలిపింది. చివరలో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ స్పెషల్ గా వెల్లడించింది. అయితే ఈ ప్లాన్ ప్రభావం టీఆర్పీ రేటింగ్ పై పడే అవకాశాలు ఉన్నాయి.

ఇన్నాళ్లు థియేటర్లు, ఓటీటీ సత్తా చాటిన ఈసినిమా ఇప్పుడు టీవీలో ఎంత రేటింగ్ సాధిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు. సలార్ ఫస్ట్ పార్టుకు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాదిలో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2 ప్రాజెక్ట్స్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు