Guntur Kaaram: ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన సూపర్ స్టార్.. 200కోట్ల క్లబ్‌లోకి గుంటూరు కారం

త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు మాస్ మసాలా లుక్ లో అదరగొట్టారు.మొదటి షో నుంచి ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మహేష్ బాబు యాక్టింగ్, ఆయన డాన్స్, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి.

Guntur Kaaram: ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన సూపర్ స్టార్.. 200కోట్ల క్లబ్‌లోకి గుంటూరు కారం
Gunturu Kaaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 19, 2024 | 2:53 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ గుంటూరు కారం. జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు మాస్ మసాలా లుక్ లో అదరగొట్టారు.మొదటి షో నుంచి ఈ సినిమాకు ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మహేష్ బాబు యాక్టింగ్, ఆయన డాన్స్, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతోంది. కొన్ని ఏరియాల్లో ఆడియన్స్ బండ్లు కట్టుకొని మరీ సినిమాకు వస్తున్నారు.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతోంది. గుంటూరు కారం సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. తొలి రోజే ఈ సినిమా 90 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఓ  రీజనల్ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సొంతం చేసుకోవడం నిజంగా రికార్డే.. తాజాగా గుంటూరు కారం సినిమా 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించింది. అలాగే రమ్యకృష్ణ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా సంక్రాంతికానుకగా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికి కూడా గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో దూసుకుపోతోంది. రేపటి నుంచి గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు తగ్గనున్నాయి. వారం రోజుల్లోనే 200కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకొని మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్ సెట్ చేశారు.

గుంటూరు కారం ట్విట్టర్

గుంటూరు కారం ట్విట్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.