Mahesh Babu: మరోసారి వెకేషన్ కు మహేష్ బాబు.. ఈసారి పుట్టిన రోజు అక్కడే
గుంటూరు కారంతో ఫుల్ బిజీగా ఉన్న ఈయన.. మరో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. మరి మహేష్ ప్రయాణం ఎప్పుడు..? ఆయన లేకపోతే గుంటూరు కారం షూటింగ్‌కు బ్రేక్ పడనుందా..?

పిడుగులు పడినా.. పద్దతులు మార్చుకోని హీరోలు కొందరుంటారు. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైమ్ ఇచ్చేస్తుంటారు. అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సిన హీరో మహేష్ బాబు. గుంటూరు కారంతో ఫుల్ బిజీగా ఉన్న ఈయన.. మరో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. మరి మహేష్ ప్రయాణం ఎప్పుడు..? ఆయన లేకపోతే గుంటూరు కారం షూటింగ్‌కు బ్రేక్ పడనుందా..?
ఇదిగో ఈ పాటలో ఎంత సంతోషంగా అయితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారో.. రియల్ లైఫ్‌లోనూ కుటుంబంతో అంతే హ్యాపీగా ఉంటారు మహేష్. బయట సూపర్ స్టార్ అయినా.. ఈయన్ని మించిన ఫ్యామిలీ మ్యాన్ మాత్రం టాలీవుడ్‌లోనే ఉండరు. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం తూచా తప్పకుండా ఇస్తుంటారు మహేష్. ఇప్పుడూ ఇదే చేయబోతున్నారు.. త్వరలోనే మరో ట్రిప్ వెళ్లనున్నారు.
కొన్ని రోజులుగా గుంటూరు కారం షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతుంది. మహేష్ సహా మిగిలిన వాళ్లపై మేజర్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. అయితే జులై చివరి వారంలో ఫ్యామిలీతో ఫారెన్ వెళ్లబోతున్నారు సూపర్ స్టార్. ఆగస్ట్ 9న పుట్టిన రోజు ఉండటంతో.. ఆ సెలబ్రేషన్స్ తర్వాతే ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. వచ్చీ రాగానే మళ్లీ గుంటూరు కారంతో బిజీ కానున్నారు మహేష్. మహేష్ బాబు లేకపోయినా.. గుంటూరు కారం షూటింగ్ మాత్రం ఆగేదే లేదంటున్నారు త్రివిక్రమ్. మహేష్ లేని సమయంలో రమ్యకృష్ణ సహా పలువురు యాక్టర్స్‌పై సీన్స్ ప్లాన్ చేస్తున్నారు మాటల మాంత్రికుడు. మహేష్ వచ్చాక.. ఆయన కాంబినేషన్ సీన్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.