AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ‘నవ్విస్తూనే ఏడిపించింది.. చప్పట్లు కొట్టేలా చేసింది’.. ఆ స్టార్ హీరో సినిమాను మెచ్చుకున్న మహేష్ బాబు

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడప్పుడూ వేరే హీరోల సినిమాలను చూస్తుంటాడు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా ఆ సినిమాలపై తన అభిప్రాయాలను చెబుతుంటాడు. అలా ఇటీవల విడుదలైన ఓ సినిమాపై ప్రశంసలు కురిపించాడు మహేష్.

Mahesh Babu: 'నవ్విస్తూనే ఏడిపించింది.. చప్పట్లు కొట్టేలా చేసింది'.. ఆ స్టార్ హీరో సినిమాను మెచ్చుకున్న మహేష్ బాబు
Mahesh Babu
Basha Shek
|

Updated on: Jun 23, 2025 | 2:35 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు ఏడాది దాటిపోయింది. చివరిగా 2024 సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో మన ముందుకు వచ్చాడు మహేష్. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో జత కట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకొంటోంది. పాన్ వరల్డ్ సబ్జెక్టుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉంటున్నాడు మహేష్. ఈ సంగతి పక్కన పెడితే ఈ మధ్యన మహేష్ ఇతరుల సినిమాలను బాగా చూస్తున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు. అలా తాజాగా రిలీజైన ఒక స్టార్ హీరో సినిమాపై ప్రశంసలు కురిపించాడు మహేష్. ఈ సినిమా నవ్విస్తూనే ఏడిపించింది.. చప్పట్లు కొట్టేలా చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడీ సూపర్ స్టార్ . ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ మహేష్ బాబు మెచ్చిన ఆ మూవీ ఏంటో తెలుసా? ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్.

ఈనెల 20న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘సితారే జమీన్ పర్‌’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. గతంలో వచ్చిన తారే జమీన్ పర్ కు ఇది సీక్వెల్ గా తెరకెక్కింంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ తదితర సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆమిర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మహేష్ బాబు కూడా సితార్ జమీన్ పర్ సినిమాను చూసిన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘సితారే జమీన్‌ పర్‌’ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ‘సితారే జమీన్‌ పర్‌’ చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు’’ అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు మహేష్.

మహేష్ బాబు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.