Mahesh Babu: హీరోగా కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు దాటినా.. రీమేక్స్ జోలికే వెళ్ల‌ని హీరో మ‌హేష్ బాబు..

సర్కారువారి పాట పాన్ ఇండియా మూవీనా కాదా అనేది ఇప్పటిదాకా సూటిగా రివీల్ చెయ్యలేదు మేకర్స్. టైటిల్ పోస్టర్ దగ్గర నుంచి.. ఏ అప్డేట్స్ లోనూ...

Mahesh Babu: హీరోగా కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు దాటినా.. రీమేక్స్ జోలికే వెళ్ల‌ని హీరో మ‌హేష్ బాబు..
Mahesh Babu
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2021 | 8:51 PM

సర్కారువారి పాట పాన్ ఇండియా మూవీనా కాదా అనేది ఇప్పటిదాకా సూటిగా రివీల్ చెయ్యలేదు మేకర్స్. టైటిల్ పోస్టర్ దగ్గర నుంచి.. ఏ అప్డేట్స్ లోనూ తమ సినిమా మల్టిలింగువల్ అనే ప్రస్తావన తీసుకురాలేదు. సరిగ్గా ఇక్కడే సర్కారువారి పాట మీద టాలీవుడ్ వెలుపల ఫోకస్ పెరిగింది. ఎందుకు? అంటే దానికీ వుంది ఓ బలమైన రీజన్. ఏం చేసినా అంతఃకరణ శుద్ధితోనే చేస్తా, మాట మీద నిలబడతా… అనేది మహేష్ మేనరిజం. హీరోగా కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు దాటినా… ఇంతవరకూ రీమేక్ అనే కాన్సెప్ట్ నే దగ్గరకు రానివ్వలేదు సూపర్ స్టార్. మిగతా హీరోలు రీమేక్స్ తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నా.. తాను మాత్రం.. నో రీమేక్స్ ప్లీజ్ అంటూ అదే సెంటిమెంట్ కి కట్టుబడి వున్నారు. కానీ.. మిగతా భాషల్లో హీరోలకు లైఫ్ ఇస్తూనే వున్నాయి మహేష్ మూవీస్.

గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఒక్కడు మూవీ.. తమిళ్, హిందీ, కన్నడ, బెంగాలీ.. ఇలా ఏకంగా నాలుగు భాషల్లో రీమేక్ అయింది. హిందీలో అర్జున్ కపూర్, తమిళ్ లో కోలీవుడ్ దళపతి విజయ్… ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అండర్ కవర్ కాప్ థియరీతో పూరి తీసిన పోకిరి కూడా.. మూడు భాషల్లో సక్సెస్ అయింది. వాంటెడ్ పేరుతో సల్మాన్ కి బ్రేక్ ఇచ్చింది పోకిరి. అవినీతిని అంతమొందించే ఆవేశపరుడైన యువకుడి కథతో తేజ చేసిన నిజం.. ఒరియా, బంగ్లా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. కలెక్షన్స్ పరంగా అంచనాల్ని రీచ్ కాలేకపోయినా.. కమర్షియల్ వ్యాల్యూస్ విషయంలో డోకా లేని బిజినెస్ మెన్, అతిధి సినిమాలు కూడా బెంగాలీలోకి రీమేక్ అయ్యాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో చేసిన అతడు… నాలుగు భాషల్లో ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసింది.

లేటెస్ట్ గా సర్కారువారి పాట తెలుగుతో పాటుఎన్ని భాషల్లో తీస్తున్నారన్న క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. మిగతా మార్కెట్స్ లో కూడా స్టామినా పెంచుకునే పనిలో వున్న మహేష్.. తన నెక్స్ట్ మూవీని అదర్ లాంగ్వేజెస్ లోకి డబ్ చేయిస్తారా లేక.. దీన్ని కూడా రీమేక్ చేసుకునే లక్కీ ఛాన్స్ పరభాషా హీరోలకే ఇస్తారా అనేది చూడాలి మరి.

Also Read: ‘రాధేశ్యామ్’తో ప్ర‌భాస్ టాలీవుడ్‌కు కొత్త దారి చూపించ‌బోతున్నాడా..?

ఫుల్ స్వింగ్ లో మాస్ మహారాజా.. జులై లో కొత్తసినిమాను పట్టాలెక్కించనున్న రవితేజ..