AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్త్‌డే పార్టీలో మహేశ్, తారక్ సందడి

టాలీవుడ్ టాప్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీఆర్ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు ఒకేచోట కలిసి సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని పైడిపల్లి పుట్టినరోజు వేడుకలు సోమవారం జరిగాయి. ఈ పార్టీకి మహేశ్, తారక్‌లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా ఫ్రెండ్ మాలిని పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆమె […]

బర్త్‌డే పార్టీలో మహేశ్, తారక్ సందడి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 09, 2019 | 12:05 PM

Share

టాలీవుడ్ టాప్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీఆర్ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు ఒకేచోట కలిసి సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య మాలిని పైడిపల్లి పుట్టినరోజు వేడుకలు సోమవారం జరిగాయి. ఈ పార్టీకి మహేశ్, తారక్‌లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా ఫ్రెండ్ మాలిని పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆమె కామెంట్ పెట్టారు. కాగా ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దానిని చూసిన ఇరు హీరోల అభిమానులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

https://www.instagram.com/p/BwAV0_mD8aO/

ఇదిలా ఉంటే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు ‘మహర్షి’లో నటించాడు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.