Mahesh Babu: సితారను చూస్తుంటే గర్వంగా ఉంది.. పుత్రికోత్సాహంతో పొంగిపోతోన్న మహేశ్- నమ్రత.. కారణమిదే
మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితారకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే హీరోయిన్లను మించి పాలోయింగ్ సొంతం చేసుకుంది స్టార్ కిడ్. మహేశ్ నటించిన సర్కారు వారి పాట కవర్ సాంగ్‌కు స్టెప్పులేసి మెప్పించిన సితార పలు యాడ్ ప్రమోషన్లలోనూ పాల్గొంటోంది.
మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితారకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే హీరోయిన్లను మించి పాలోయింగ్ సొంతం చేసుకుంది స్టార్ కిడ్. మహేశ్ నటించిన సర్కారు వారి పాట కవర్ సాంగ్‌కు స్టెప్పులేసి మెప్పించిన సితార పలు యాడ్ ప్రమోషన్లలోనూ పాల్గొంటోంది. ఇదిలా ఉంటే సినిమాల్లో ఓనమాలు నేర్చుకున్నప్పటికీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు సితార. ఇందులో భాగంగా తాజాగా సెకండరీ స్కూల్ లోకి కూడా అడుగుపెట్టింది. సితార చదువుతున్న స్కూల్ లో సెకండరీ స్కూల్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహేష్, నమ్రత దంపతులు కూడా హాజరయ్యారు. తమ కుమార్తె సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న క్షణాలను చూసి మురిసిపోయారు. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌కు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది నమ్రత.’ నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.. నా పాత రోజులన్నీ గుర్తుకు వస్తున్నాయి.. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న నువ్వు.. ఇప్పుడు కొత్త దశలోకి వెళ్తున్నావ్.. సెకండరీ స్కూల్‌కు గ్రాడ్యుయేట్ అవుతున్నందుకు కంగ్రాట్స్.. నువ్వు అడుగు పెట్టిన ప్రతీ చోట నీ కష్టంతో వెలిగిపోవాలని కోరుకుంటున్నాను.. రానున్న రోజుల్లో నువ్వు సాధించబోయే విజయాలకు ఆల్ ది బెస్ట్.. నాన్న, అన్నయ్య, నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం.. ఇప్పటి వరకు సితారకు తోడ్పాటు అందించిన టీచర్లకు థాంక్స్’ అంటూ ఎమోషనల్ అయ్యింది నమ్రత.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు సితారకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేశ్. ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్గే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, జయరాం, హైపర్ ఆది, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..