Allu Arjun: బన్ని బ్లాక్‌ చేశాడంటూ ట్రెండింగ్‌లోకి.. అసలేం జరిగిందో వివరణ ఇచ్చిన హీరోయిన్‌

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోందీ హీరోయిన్‌. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే నిన్న (మార్చి 18) హఠాత్తుగా భానుశ్రీ మెహ్రా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Allu Arjun: బన్ని బ్లాక్‌ చేశాడంటూ ట్రెండింగ్‌లోకి.. అసలేం జరిగిందో వివరణ ఇచ్చిన హీరోయిన్‌
Allu Arjun, Bhanu Sri
Follow us
Basha Shek

|

Updated on: Mar 19, 2023 | 3:34 PM

గుణశేఖర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం వరుడు. 2010లో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది పంజాబీ బ్యూటీ భానుశ్రీ మెహ్రా. అయితే సినిమా ప్లాఫ్‌ కావడంతో వరుడు తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో కనిపించింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోందీ హీరోయిన్‌. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే నిన్న (మార్చి 18) హఠాత్తుగా భానుశ్రీ మెహ్రా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీనికి కారణం ఆమె చేసిన ట్వీటే. ‘అల్లు అర్జున్‌తో కలిసి వరుడు సినిమాలో నటించాను. అయినప్పటికీ నాకెలాంటి ఛాన్సులు రాలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అయితే సమస్యల్లోనే సంతోషాన్ని వెతుక్కోవడం నేర్చుకున్నాను. మరీ, ముఖ్యంగా అల్లు అర్జున్‌ ట్విటర్‌లో నన్ను బ్లాక్‌ చేశారని తెలుసుకున్నా’ అని మొదట ట్వీట్‌ చేసింది భానుశ్రీ. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. ‘అసలు ఏమైంది’? అని కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. దీంతో ఈ భామ పేరు కాస్తా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

బన్నీ ఫ్యాన్స్‌ను హర్ట్‌ చేయలేదు..

ఈ ట్వీట్‌ చేసిన మూడు గంటల తర్వాత బన్నీ గురించి మరో ట్వీట్‌ చేసింది భానుశ్రీ. ‘ గ్రేట్‌ న్యూస్‌.. బన్నీ నన్ను అన్‌బ్లాక్‌ చేశాడు! నా కెరీర్‌ పరాజయానికి నేను ఆయన్ని ఎప్పుడూ నిందించలేదు. కష్టాల నుంచే ఎన్నో నేర్చుకుంటూ ముందుకు సాగిపోతున్నా’ అని ట్వీట్‌లో పేర్కొంది. అయితే అప్పటికే భానుశ్రీపై ఫుల్‌ ఫైర్‌ అయ్యారు బన్నీ ఫ్యాన్స్‌. అనవసరంగా తమ హీరోని బ్లేమ్‌ చేస్తున్నావంటూ ఆమెను ట్రోల్‌ చేస్తూ కామెంట్లు పెట్టారు. దీంతో భానుశ్రీ మరోసారి వివరణ ఇచ్చింది. ‘ ఈ రోజంతా కూడా వింతగా జరిగింది. అంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించింది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేందుకు ఆ ట్వీట్ చేయలేదు. నేను కూడా బన్నీకి పెద్ద ఫ్యాన్‌నే. నా కెరీర్‌ను చూసి నేను నవ్వుకుంటాను. నా బాధలు చూసి నేనే నవ్వుకుంటున్నాను. ప్రేమను పంచుదాం.. ద్వేషాన్ని వద్దు’ అని ట్వి్ట్టర్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా తాను డ్రింక్‌ చేస్తున్న వీడియోను కూడా షేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్