Bharateeyudu 2: తొలగిన అడ్డంకులు భారతీయుడు-2 సినిమాకు కోర్ట్ గ్రీన్‌సిగ్నల్..

ఈ రోజుల్లో క్లైమాక్స్ లేని సినిమాలైనా వస్తున్నాయేమో కానీ.. సీక్వెల్‌ లేని భారీ సినిమాలు మాత్రం రావట్లేదు. ప్రతి సినిమాకు క్లైమాక్స్‌లో పార్ట్ 2 అని వేస్తున్నారు. అది తీస్తారో తీయరో తర్వాతి విషయం. ముందైతే ఓ ప్రకటనే కదా అని చేస్తున్నారు. మరి ఇండియన్-2లోనూ అదే చేయబోతున్నారా..? క్లైమాక్స్‌లో పార్ట్ 3కి సంబంధించిన అప్‌డేట్ ఎలా ఉండబోతుంది..?

Bharateeyudu 2
Follow us

|

Updated on: Jul 11, 2024 | 9:46 PM

భారతీయుడు వస్తూనే ఉంటాడు.. అవినీతిని అంతం చేసేదాకా! యస్‌. భారతీయుడు-2 మూవీలో అసలు ట్విస్ట్‌ ఏంటో మరి కొద్ది గంటల్లో తెరపై కనిపించనుంది. ఇప్పుడు దేశంలో ఏం నడుస్తోంది అంటే భారతీయుడు సినిమా టాపిక్‌ ఒక్కటే నడుస్తోంది. దేశమంతా భారతీయుడు -2 హవా కనిపిస్తోంది. భారతీయుడు మూవీ వచ్చిన దాదాపు 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు సీక్వెల్ రావడం, ఆసక్తిని రేపుతోంది. అయితే అది 3గంటల పైగా నిడివి ఉన్న సినిమా కావడంతో ఇప్పటి జనరేషన్‌ని ఆకట్టుకోగలుగుతుందా అనే చర్చ కూడా సాగుతోంది. ఈమధ్య కాలంలో దిగ్గజ దర్శకుడు శంకర్‌ అంత ఫామ్‌లో లేడు. అయితే లోక నాయకుడు కమల్‌ హాసన్‌ మాత్రం, విక్రమ్‌ సినిమా సూపర్‌ హిట్‌ తర్వాత మాంచి జోరు మీదున్నారు. కమల్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రేపు విడుదల అవుతున్న భారతీయుడు-2 మూవీ మీద అంచనాలు భారీ గానే ఉన్నాయి.

ఈ రోజుల్లో క్లైమాక్స్ లేని సినిమాలైనా వస్తున్నాయేమో కానీ.. సీక్వెల్‌ లేని భారీ సినిమాలు మాత్రం రావట్లేదు. ప్రతి సినిమాకు క్లైమాక్స్‌లో పార్ట్ 2 అని వేస్తున్నారు. అది తీస్తారో తీయరో తర్వాతి విషయం. ముందైతే ఓ ప్రకటనే కదా అని చేస్తున్నారు. మరి ఇండియన్-2లోనూ అదే చేయబోతున్నారా..? క్లైమాక్స్‌లో పార్ట్ 3కి సంబంధించిన అప్‌డేట్ ఎలా ఉండబోతుంది..?

ఆరేళ్ళ కింద మొదలైంది.. ఐదేళ్లుగా సెట్స్‌పైనే ఉంది.. రెండేళ్లు ఆగిపోయింది.. ఏడాదిన్నర కింద హడావిడిగా తిరిగి మొదలైంది.. మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని ఇప్పుడు థియేటర్స్‌లోకి వచ్చేస్తోంది ఇండియన్ 2. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగులోనూ భారీగానే వస్తున్నాడు భారతీయుడు – 2. ఇండియన్ 2 మాత్రమే కాదు.. దీనికి పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు. కమల్ హాసన్ అయితే ఓ అడుగు ముందుకేసి భారతీయుడు 3 కోసమే తాను 2 చేశానంటూ, సినిమాపై హైప్‌ని మరింత పెంచేశారు. అంతగా ఆ సినిమాలో ఏముంటుందబ్బా అంటూ ఆడియన్స్ కూడా బాగానే ఊహల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ ఎగ్జైట్‌మెంట్ మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు శంకర్.

ఇదిలా ఉంటే భారతీయుడు-2 సినిమాకు మదురై కోర్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది మదురై కోర్టు. అయితే ఈ సినిమాలోని మర్మకళ సన్నివేశాలపై రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పుస్తకం ఆధారంగా సన్నివేశాలు తీశారని రాజేంద్రన్ ఆరోపించారు. అయితే భారతీయుడు పార్ట్‌-1లోని సన్నివేశాలు కొనసాగించమని నిర్మాతలు కోర్టుకు తెలిపారు. దాంతో రాజేంద్రన్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది కోర్టు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?

న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. లావణ్య కామెంట్స్..

ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. రోగిని కాల్చి చంపిన యువకుడు!

టీమిండియా మాజీ ఆటగాడికి కోటి రూపాయల సాయం.. ఎందుకంటే?

సేవింగ్స్ ఖాతాలోని సొమ్ముతో ఈజీగా పెట్టుబడి..లాభాలు ఏంటంటే..?

రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

ఇది అమ్మవారి మహిమే.. పానకం తాగిన ‘వారాహి’ విగ్రహం.. వీడియో

శాంసన్ హాఫ్ సెంచరీ.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?

ఆ పథకంలో పెట్టుబడితో రాబడి వరద..ప్రభుత్వ మద్దతునిచ్చే పథకం ఏదంటే?

మీకు వచ్చే అద్దె నుంచి రుణం పొందొచ్చు తెలుసా? డబుల్ ఆఫర్ ఇలా..

శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!

ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.

టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.

చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..

ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..

రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..

అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..

ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!

అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం రేవంత్ గుడ్ న్యూస్..