Manchi Rojulochaie: సినిమా అంతా పగలబడి నవ్వడం ఖాయం.. మారుతి సినిమాపై మ్యాచో హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్

సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ జంటగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మారుతి తెరకెక్కిస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి.

Manchi Rojulochaie: సినిమా అంతా పగలబడి నవ్వడం ఖాయం.. మారుతి సినిమాపై మ్యాచో హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్
Gopi Chand
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 30, 2021 | 6:35 PM

Manchi Rojulochaie: సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మారుతి తెరకెక్కిస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. యాక్షన్ హీరో గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. “కేవలం నా టాలెంట్ నమ్మి మళ్లీ మళ్లీ నాకు అవకాశాలు ఇస్తున్న యు.వి.కాన్సెప్ట్స్ కు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు. ఈ స్టేజ్ ఎక్కడానికి ఎంతో కష్టపడ్డాను. మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా అందరినీ అలరిస్తోంది. నవంబర్ 4న థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవాలి అని కోరుకుంటున్నాను అని అన్నాడు సంతోష్.

అలాగే హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ” మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాను అనేది రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను.. మీకు కూడా రేపు నవంబర్ 4న థియేటర్లలో అది తెలుస్తుంది. సినిమా అంతా పగలబడి నవ్వడం ఖాయం. అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఉంది మారుతి. ఆయన ఒక బ్రాండ్ అన్నారు గోపీచంద్.  మంచి రోజులు వచ్చాయి పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “కరోనా తర్వాత అందరు తెలియకుండానే ఒక భయంలోకి వెళ్లిపోతున్నారు. ఆ భయం మీద ఎందుకు సినిమా చేయకూడదు అనే ఐడియా నాకు వచ్చింది. అది వచ్చిన వెంటనే 20 రోజుల్లో కథ రాసి.. 30 రోజుల్లో సినిమా తీశాను. ముందు నా పేరు వేసుకోకూడదు అనుకున్నాను. కానీ ఒక మంచి విషయం చెబుతున్నప్పుడు దాని ఫలితం కూడా మనమే తీసుకోవాలని అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు మారుతి. సాధారణంగా ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు చిన్న సినిమా చేయాలి అంటే నిర్మాతలు ఒప్పుకోరు. కానీ నేనేం చేసినా కూడా నా వెనక మంచి మనుషులు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మంచి రోజులు వచ్చాయి సినిమా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఈ సినిమా సరదాగా చేసినా.. సీరియస్ విషయం ఉంది. ఖచ్చితంగా నవంబర్ 4న థియేటర్లలో మీరు ఈ సినిమా చూసి నవ్వుతారు.. ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను అని మారుతి చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Movie: అన్నీ భాషల్లో అదరగొడుతున్న ఐకాన్ స్టార్ “సామీ సామీ” సాంగ్..

Ritu Varma: రితూ వర్మ లేటెస్ట్ ఫోటో షూట్.. అదరహో అనిపిస్తోన్న వరుడు కావలెను భామ

Deepthi Sunaina: చిలిపిగా కవ్విస్తున్న బిగ్ బాస్ బ్యూటీ… దీప్తి సునయన లేటెస్ట్ పిక్స్

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?