Guntur Karam: గుంటూరు కారం ‘ఓ మై బేబీ’ సాంగ్ పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన రామజోగయ్య శాస్త్రి..
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం విడుదల టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోస్టర్స్, టీజర్‍తోనే హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ దమ్ మసాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మహేష్ న్యూలుక్ .. త్రివిక్రమ్ మాస్ మేకింగ్ కోసం అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇందులో మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం విడుదల టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఇప్పుడు వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మహేష్ కోసం శ్రీలీల పాడుతున్న ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను శిల్పారావు ఆలపించారు. అయితే ఈ పాటకు ఓవైపు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. థమన్ మళ్లీ పాత ట్యూన్ మార్చేసి సెట్ చేశాడని.. లిరిక్స్ అస్సలు బాలేవు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ. రామజోగయ్య శాస్త్రిని, నిర్మాత సూర్య దేవర నాగవంశీలను, థమన్ ను ట్యాగ్ చేశాడు. దీంతో ఓ మై బేబీ సాంగ్ పై వస్తున్న విమర్శలపై సీరియస్ అయ్యాడు రామజోగయ్య శాస్త్రి. సోషల్ మీడియా కుక్కల చేతుల్లోకి వెళ్లిపోతుదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సోషల్ మీడియా కుక్కల చేతుల్లోకి వెళ్లిపోతుంది. పాట కంపోజింగ్ గురించి ఒక్క ముక్క కూడా తెలియదు వీళ్లకు. అది తెలిసినవాళ్లే కామెంట్ చేయగలరు. జడ్జ్ చేయగలరు. దురుద్దేశంతో కావాలని పనిగట్టుకుని ద్వేషాన్ని వ్యా్ప్తి చేస్తుననారు. టెక్నీషియన్లను టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి. గీతలు దాటుతున్నారు వీళ్లు” అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసిన ట్వీట్ కు రిప్లై పోస్ట్ చేశారు.
ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. “ప్రతివాడు మాట్లాడేవాడే.. రాయి విసిరే వాడే.. అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది. పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని.. మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే లేకపోతే.. ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం.. తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి” అంటూ ట్వీట్ చేశారు. అయితే రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. కొందరు ఆయన మాటలకు మద్దతు పలుకుతుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.




