Ayalaan Movie: ‘అయాలన్’ సినిమాలో ఏలియన్‌కు డబ్బింగ్ చెప్పినందుకు సిద్ధార్థ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?..
ఈ సినిమాలో హీరోకు ఏలియన్‌తో స్నేహం కుదురుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో ఏలియన్ పాత్రకు కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిచారు. ఈ చిత్రంలో ఏలియన్ పాత్రకు దాదాపు మూడు రోజుల పాటు డబ్బింగ్ చెప్పాడు సిద్ధార్థ్. అందులో ఒకటి ఆదివారం. ఆ రోజు సినీ కార్మికులకు సెలవు కావడంతో ప్రత్యేక అనుమతి తీసుకుని డబ్బింగ్ చెప్పారు.

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా అయాలన్. డైరెక్టర్ ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాహుల్ ప్రీత్ సింగ్, శరద్ కోల్కర్, ఇషా గోబికర్, భానుప్రియ, యోగి బాబు, బాల శరవణన్, సతీష్ నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 2018లోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ అప్పట్లో 24 AM స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన కొన్ని సినిమాల భారీ బడ్జెట్ కారణంగా అయాలన్ మూవీ షూటింగ్ వాయిదా పడింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ CG వర్క్ కోసం ఊహించని స్థాయిలో బడ్జెట్ పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత కేజేఆర్ స్టూడియోస్ సహ-నిర్మాతగా నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోకు ఏలియన్‌తో స్నేహం కుదురుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో ఏలియన్ పాత్రకు కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిచారు. ఈ చిత్రంలో ఏలియన్ పాత్రకు దాదాపు మూడు రోజుల పాటు డబ్బింగ్ చెప్పాడు సిద్ధార్థ్. అందులో ఒకటి ఆదివారం. ఆ రోజు సినీ కార్మికులకు సెలవు కావడంతో ప్రత్యేక అనుమతి తీసుకుని డబ్బింగ్ చెప్పారు. సిద్ధార్థ్ చేసిన ఈ సహాయాన్ని KJR స్టూడియోస్ అభినందిస్తూ ట్వీట్ చేసింది. “మీ అంకితభావం, కృషి మా అయాలన్ సినిమానును చాలా వాస్తవికంగా, అందంగా మార్చాయి. మీ పనిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారని ఆశిస్తున్నాము” అంటూ ట్వీట్ చేశారు.
Here we go✨ Unveiling you the voice of our cute cosmic friend: Actor #Siddharth🎙️
Who guessed it right?
Get ready for more updates from #Ayalaan#AyalaanFromPongal🎇 #AyalaanFromSankranti🎆#Ayalaan @Siva_Kartikeyan @TheAyalaan @arrahman @Ravikumar_Dir @Phantomfxstudio… pic.twitter.com/kbnVyaYEn1
— KJR Studios (@kjr_studios) December 13, 2023
చిత్ర దర్శకుడు ఆర్.రవికుమార్ సిద్ధార్థ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. “అయాలాన్‌కు ప్రేమ, అభిరుచితో డబ్బింగ్ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సిద్ధార్థ్ సర్” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు ఏలియన్ పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు సిద్ధార్థ్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నిజానికి ఈ సినిమాలో ఏలియన్ పాత్రకు దాదాపు మూడు రోజుల డబ్బింగ్ చర్చలకు సిద్ధార్థ్ డబ్బులు తీసుకోలేదట. నిర్మాతలు భారీ మొత్తంలో ఇస్తానని ఆఫర్ చేసినా.. సిద్ధార్థ్ నిరాకరించాడట. అందుకు ఆయనకు చిత్రబృందం మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
Walk into a realm where the ordinary ends and welcome our intergalactic visitor👽 with the #AyalaanTeaser🛸✨ #AyalaanTamilTeaser ▶️ https://t.co/yet1QwUDRV#AyalaanTeluguTeaser ▶️ https://t.co/cCbSFBocjD#AyalaanTeaserLaunch #AyalaanFromPongal #AyalaanFromSankranti#Ayalaan… pic.twitter.com/wTMV1jPpsc
— KJR Studios (@kjr_studios) October 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.